Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 2022కు భారత్ ఆతిథ్యం : ఫిఫా
న్యూఢిల్లీ: 2021లో భారత్ వేదికగా జరగాల్సిన ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ టోర్నీని రద్దు చేస్తున్నట్టు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య(ఫిఫా) బుధవారం తెలిపింది. అలాగే 2022 ఆతిథ్య హక్కులను భారత్‌కే అప్పగిస్తున్నట్టు ప్రకటించింది. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఫిఫా అండర్-17 మహిళల ప్రపంచకప్ టోర్నమెంట్‌ను ఫిఫా వచ్చే ఏడాదికి తొలుత వాయిదా వేసింది. కరోనా తీవ్రత ప్రపంచవ్యాప్తంగా ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో 2021 ఫిబ్రవరి-మార్చిలో భారత్ వేదికగా జరగాల్సిన టోర్నమెంట్‌ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.