Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: వచ్చే ఏడాది ఇంగ్లాండ్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ సిరీస్‌లో భాగంగా భారత్.. ఇంగ్లాండ్‌తో ఐదు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనున్నట్లు ఇంగ్లాండ్-వేల్స్ క్రికెట్ బోర్డు(ఈసీబీ) బుధ వారం అధికారికంగా ప్రకటించింది. ఆగస్టు 4-8న ట్రెంట్‌బ్రిడ్జ్ వేదికగా జరిగే తొలిటెస్ట్‌తో సుదీర్ఘ టెస్ట్ సిరీస్ ఆరంభం కానుంది. ఆఖరి టెస్ట్ మాంఛెస్టర్ వేదికగా సెప్టెంబర్ 10-14మధ్య జరగనుంది. ఈ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించేందుకు అభిమానులకు అనుమతిస్తున్నట్టు తెలిపింది. ఈ టెస్ట్ సిరీస్‌కు సంబంధించి జనవరినుంచి టిక్కెట్లు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని ఇప్పుడే ప్రకటించేసింది. భారత్‌తో టెస్ట్ సిరీస్‌కు ముందు ఇంగ్లాండ్.. పాకిస్తాన్, శ్రీలంకలతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడనున్నట్టు తెలిపింది.
16ఏండ్ల తర్వాత పాక్ పర్యటనకు ఇంగ్లాండ్..
16ఏళ్ల సుదీర్ఘ విరామం అనంతరం ఇంగ్లాండ్ క్రికెట్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటనకు వెళ్లనుంది. ఈ మేరకు బుధవారం ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు చీఫ్ ఎగ్జిక్యూటివ్ టోమ్ హరిసన్ జట్టు పర్యటనను ఖరారు చేశారు. 2021, అక్టోబర్‌లో భారత్‌లో జరిగే టి20 పురుషుల ప్రపంచకప్‌కు ముందు ఇంగ్లాండ్ జట్టు పాకిస్తాన్‌లో పర్యటించనుంది. అక్టోబర్ 12న ఇంగ్లాండ్ జట్టు పాక్‌కు చేరుకొని కరాచీలో 14, 15న రెండు టి20 మ్యాచ్‌లు ఆడనున్నట్టు తెలిపారు.
షెడ్యూల్...
ఆగస్టు 4-8 : తొలిటెస్ట్(ట్రెంట్‌బ్రిడ్జ్)
ఆగస్టు 12-16 : రెండోటెస్ట్(లండన్)
ఆగస్టు 25-29 : మూడోటెస్ట్(హెడ్డింగ్లీ)
సెప్టెంబర్ 2-6 : నాల్గోటెస్ట్(ఓవల్)
సెప్టెంబర్ 10-14 : ఐదోటెస్ట్(మాంఛెస్టర్)