Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిడ్నీ టెస్టుపై వీవీఎస్ లక్ష్మణ్
ముంబయి : ఆస్ట్రేలియా పర్యటనలో భారత జట్టు గొప్పగా పుంజుకుంది. 36 పరుగులకే కుప్పకూలిన అనంతరం, తర్వాతి టెస్టులో కండ్లుచెదిరే విజయంతో సిరీస్‌ను 1-1తో సమం చేసింది. మైదానం వెలుపలా విశ్లేషకులు ఏ విధంగా వర్ణించినా.. తిరుగులేని సమాధానం భారత జట్టే ఇచ్చిందని మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు. ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ కీలకం అవుతాడని వీవీఎస్ అభిప్రాయం వ్యక్తపరిచారు. ' మెల్‌బోర్న్ జట్టు నుంచి ఓ బ్యాట్స్‌మన్ బెంచ్‌కు పరిమితం కావాల్సిందే. మయాంక్ అగర్వాల్ స్థానంలో రోహిత్ శర్మ తుది జట్టులోకి వస్తాడని అనుకుంటున్నాను. దక్షిణాఫ్రికాతో సిరీస్ నుంచి రోహిత్ శర్మ ఓపెనర్‌గా ఎదురులేని గణాంకాలు నమోదు చేశాడు. రోహిత్ శర్మ రాకతో భారత జట్టు సంతోషపడుతుందని అనుకుంటున్నాను. విరాట్ కోహ్లి లేని వేళ డ్రెస్సింగ్‌రూమ్‌లో రోహిత్ శర్మ అనుభవం ఉపయోగపడనుంది. బోర్డర్-గవాస్కర్ సిరీస్‌ను 2-1, 3-1 చేసేందుకు భారత జట్టుకు ఇదే సదవకాశం. రోహిత్ శర్మ సైతం సత్తా చాటేందుకు ఎదురుచూస్తున్నాడు. ఆస్ట్రేలియా పిచ్‌లు రోహిత్ శర్మ ఆట తీరుకు సరిపోలుతాయని నేను ఎప్పుడు విశ్వసిస్తాను. సిడ్నీలో అతడు కొత్త బంతిని కాచుకుంటే, హిట్‌మ్యాన్ నుంచి మెగా శతకం రావటం ఖాయమే' అని వీవీఎస్ లక్ష్మణ్ అన్నారు.