Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
ఆసీస్‌ దే తొలి రోజు | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 08,2021

ఆసీస్‌ దే తొలి రోజు

- పకోస్కీ, లబుషేన్‌ అర్థ సెంచరీలు
- ఆశలు రేపుతున్న స్టీవ్‌ స్మిత్‌ ఇన్నింగ్స్‌
- ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ 166/2
- భారత్‌, ఆసీస్‌ సిడ్నీ టెస్టు తొలి రోజు
                 పచ్చికతో కూడిన పిచ్‌. మేఘావృతమైన వాతావరణం. తొలి రెండు సెషన్లలో చిరు జల్లుల విరామమే అధికం. ఈ పరిస్థితులు కచ్చితంగా భారత పేస్‌ బృందానికి ఉత్సాహాన్ని ఇచ్చేవే. కానీ ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌ను కట్టడి చేయటంలో బుమ్రా బృందం తొలి రోజు నిరాశపరిచింది. ఆరంభంలో చూపిన తెగువ.. మ్యాచ్‌ సాగుతున్న కొద్దీ లోపించింది. చెత్త బంతులు సంధించి బ్యాట్స్‌మెన్‌పై ఒత్తిడి లేకుండా చేసింది!. ఫలితంగా అరంగేట్ర ఓపెనర్‌ విల్‌ పకోస్కీ (62), మార్నస్‌ లబుషేన్‌ (67 నాటౌట్‌) అర్థ సెంచరీలతో చెలరేగారు. సిడ్నీ టెస్టు తొలి రోజు ఆటలో ఆస్ట్రేలియాను ముందంజలో నిలిపారు.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
అరంగేట్ర బ్యాట్స్‌మన్‌, యువ ఓపెనర్‌ విల్‌ పకోస్కీ (62, 110 బంతుల్లో 4 ఫోర్లు), నం.3 బ్యాట్స్‌మన్‌ మార్నస్‌ లబుషేన్‌ (67 బ్యాటింగ్‌, 149 బంతుల్లో 8 ఫోర్లు) అర్థ సెంచరీలు సాధించారు. ప్రమాదకర ఓపెనర్‌ డెవిడ్‌ వార్నర్‌ (5) ఆరంభంలోనే నిష్క్రమించినా, ఆ లోటు ఎక్కడా కనిపించలేదు. విలక్షణ టెస్టు బ్యాట్స్‌మన్‌ స్టీవ్‌ స్మిత్‌ (31 బ్యాటింగ్‌, 64 బంతుల్లో 5 ఫోర్లు) సిడ్నీలో తిరిగి ఫామ్‌ సాధించినట్టు కనిపిస్తున్నాడు. ఆస్ట్రేలియా టాప్‌ ఆర్డర్‌లో ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ మెరవటంతో ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 166/2తో భారీ స్కోరు దిశగా పయనిస్తోంది. భారత బౌలర్లలో మహ్మద్‌ సిరాజ్‌ (1/46), నవదీప్‌ సైని (1/32)లు చెరో వికెట్‌ పడగొట్టారు. వర్షం తీవ్ర అంతరాయం కలిగించిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా తొలి రోజును సంతృప్తికరంగా ముగించింది. నేడూ కంగారూ బ్యాట్స్‌మెన్‌ జోరు ఇలాగే కొనసాగితే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టు భారీ స్కోరు బాదటం లాంఛనమే!.
తొలి సెషన్‌ : డెవిడ్‌ వార్నర్‌ నిష్క్రమణ
టాస్‌ గెల్చుకున్న ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. యువ ఓపెనర్‌ విల్‌ పకోస్కీ అరంగేట్ర అవకాశం దక్కించుకున్నాడు. వంద శాతం ఫిట్‌నెస్‌ లేకపోయినా, డెవిడ్‌ వార్నర్‌ సిడ్నీలో బరిలోకి దిగాడు. కానీ వార్నర్‌ను క్రీజులో ఏమాత్రం సౌకర్యవంతంగా ఉంచలేదు భారత పేసర్లు. మహ్మద్‌ సిరాజ్‌ ఇన్నింగ్స్‌ నాల్గో ఓవర్లోనే ప్రమాదకర డెవిడ్‌ వార్నర్‌ (5)ను అవుట్‌ చేశాడు. డ్రైవ్‌కు ప్రయత్నించిన వార్నర్‌ ఎడ్జ్‌తో రెండో స్లిప్స్‌లో పుజారా చేతికి చిక్కాడు. 2016, నవంబర్‌ తర్వాత సొంతగడ్డపై వార్నర్‌ అతి తక్కువ స్కోరుకు అవుట్‌ కావటం ఇదే తొలిసారి. ఆ తర్వాత సింగిల్‌ డిజిట్‌ స్కోరుకే వికెట్‌ కోల్పోవటం సైతం ఇదే ప్రథమం. ఆరంభంలోనే డెవిడ్‌ వార్నర్‌ వికెట్‌తో భారత్‌ బ్రేక్‌ సాధించింది. అరంగేట్ర ఓపెనర్‌ పకోస్కీ (14), మార్నస్‌ లబుషేన్‌ (2) మరో మూడు ఓవర్లు ఆడగానే.. వర్షం అంతరాయం కలిగించింది. తొలి సెషన్‌లో కేవలం 30 నిమిషాల ఆట మాత్రమే సాధ్యపడింది. 7.1 ఓవర్లలో 21/1తో ఆస్ట్రేలియా లంచ్‌ విరామానికి వెళ్లింది.
రెండో సెషన్‌ : పకోస్కీ, లబుషేన్‌ ప్రతాపం
వార్నర్‌ను అవుట్‌ చేసిన ఆనందం భారత శిబిరంలో ఎంతోసేపు నిలువలేదు. వర్షం విరామం అనంతరం, వికెట్లు ఆశించినా అదీ దక్కలేదు. రిషబ్‌ పంత్‌ ఇచ్చిన రెండు జీవనదానాలతో అరంగేట్ర ఓపెనర్‌ విల్‌ పకోస్కీ కెరీర్‌ తొలి అర్థ సెంచరీ బాదేశాడు. 97 బంతుల్లో 4 ఫోర్లతో 50 పరుగుల మైలురాయిని అందుకున్నాడు. మరో ఎండ్‌లో మార్నస్‌ లబుషేన్‌ నిలకడగా పరుగులు సాధించాడు. 14వ ఓవర్లోనే అశ్విన్‌ను ప్రయోగించిన రహానె మరో బ్రేక్‌ రాబట్టలేకపోయాడు. పకోస్కీ, లబుషేన్‌లు స్కోరింగ్‌ రేటును పెంచారు. తొలి 50 పరుగులకు 140 బంతులు తీసుకున్న ఆస్ట్రేలియా.. రెండో 50 పరుగులను 58 బంతుల్లోనే పిండుకుంది. దీంతో రెండో సెషన్లో ఆసీస్‌ వేగంగా పరుగులు సాధించింది. టీ విరామ సమయానికి పకోస్కీ (54), లబుషేన్‌ (34)లు ఆసీస్‌ను ముందంజలో నిలిపారు. ఈ సెషన్లో భారత బౌలర్లకు ఒక్క వికెట్‌ సైతం దక్కలేదు.
మూడో సెషన్‌ : పట్టు బిగించిన ఆస్ట్రేలియా
టీ విరామం అనంతరం, అర్థ సెంచరీ హీరో విల్‌ పకోస్కీ (62)ని నవదీప్‌ సైని పడగొట్టాడు. సైని బంతికి పకోస్కీ వికెట్ల ముందు ఎల్బీగా అవుటయ్యాడు. మార్నస్‌ లబుషేన్‌ 108 బంతుల్లో ఆరు ఫోర్లతో అర్థ సెంచరీ సాధించాడు. స్టీవ్‌ స్మిత్‌ క్రీజులోకి రాగానే అశ్విన్‌ చేతికి బంతిని అందించిన రహానె.. అతడిని ఒత్తిడిలో పడేసేందుకు చూసింది. కానీ స్మిత్‌ అశ్విన్‌పై ఎదురుదాడి చేశాడు. క్రీజు వదిలి బటయకొచ్చి అశ్విన్‌ను ఎదుర్కొన్నాడు. దీంతో అశ్విన్‌ ఎటాకింగ్‌ నుంచి డిఫెన్సివ్‌లోకి వెళ్లకతప్పలేదు. బుమ్రా ఓవర్లో స్మిత్‌ మూడు ఫోర్లు బాదగా.. లబుషేన్‌ సిరాజ్‌ను బౌండరీలుగా మలిచాడు. ఈ జోడీ మరింత వేగంగా 63 బంతుల్లోనే మరో 50 పరుగులు జోడించింది. భారత్‌పై వన్డేల్లో సిడ్నీలో మెరుపు శతకాలు బాదిన స్మిత్‌.. అదే సిడ్నీలో తిరిగి ఫామ్‌ సాధించినట్టు కనిపిస్తున్నాడు. 64 బంతుల్లో ఐదు ఫోర్లతో అజేయంగా 31 పరుగులు చేశాడు. సిరీస్‌లో నిలకడగా పరుగులు రాబడుతున్న మార్నస్‌ లబుషేన్‌ 67 పరుగులతో క్రీజులో కొనసాగుతున్నాడు. ఈ జోడీ మూడో వికెట్‌కు 125 బంతుల్లో 60 పరుగులు జోడించింది. ఓపెనర్లను మాత్రమే కోల్పోయిన ఆస్ట్రేలియా సిడ్నీలో భారీ స్కోరుకు గట్టి పునాది వేసుకుంది. నేడు భారత బౌలర్లు పుంజుకుంటే ఆట ఆసక్తికరంగా మారనుంది. లేదంటే, కంగారూ జోరును ఆపటం కష్టమే.
పంత్‌.. ఇలా చేశాడే! : ఆస్ట్రేలియా అరంగేట్ర ఆటగాడు విల్‌ పకోస్కీ కెరీర్‌ తొలి ఇన్నింగ్స్‌లోనే అర్థ సెంచరీతో రాణించాడు. భారత యువ వికెట్‌ కీపర్‌ రిషబ్‌ పంత్‌ రెండు సార్లు అతడి క్యాచ్‌ను నేల పాలు చేసి, తొలి రోజు ఆటలో భారత్‌ను రేసులో వెనక్కి నెట్టాడు. తొలుత అశ్విన్‌ ఓవర్లో పకోస్కీ అవుట్‌ సైడ్‌ ఎడ్జ్‌తో దొరికిపోవాల్సింది. కానీ రిషబ్‌ పంత్‌ నేరుగా చేతిలోకి వచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేశాడు. మరో నాలుగు ఓవర్ల తర్వాత, మహ్మద్‌ సిరాజ్‌ ఓవర్లో షార్ట్‌ బాల్‌కు పకోస్కీ వికెట్ల వెనకాల క్యాచ్‌ ఇచ్చాడు. రిషబ్‌ పంత్‌ తొలి ప్రయత్నంలో జారవిడిచినా.. డైవ్‌ చేసి మరోసారి ప్రయత్నించాడు. అయినా, క్యాచ్‌ను అందుకోలేకపోయాడు. తొలి సారి క్యాచ్‌ను వదిలేసినప్పుడు పకోస్కీ స్కోరు 26 కాగా, రెండో సారి 32 పరుగులు. పకోస్కీ 62 పరుగుల ఇన్నింగ్స్‌తో ఆసీస్‌ను ఆధిక్యంలో నిలిపాడు. రిషబ్‌ పంత్‌ క్యాచులు అందుకుంటే, తొలి రోజు ఆటలో భారత్‌ సైతం రేసులో నిలిచేది.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : విల్‌ పకోస్కీ (ఎల్బీ) నవదీప్‌ సైని 62, డెవిడ్‌ వార్నర్‌ (సి) చతేశ్వర్‌ పుజారా (బి) మహ్మద్‌ సిరాజ్‌ 5, మార్నస్‌ లబుషేన్‌ బ్యాటింగ్‌ 67, స్టీవ్‌ స్మిత్‌ బ్యాటింగ్‌ 31, ఎక్స్‌ట్రాలు : 01, మొత్తం : (55 ఓవర్లలో 2 వికెట్లకు) 166.
వికెట్ల పతనం : 1-6, 2-106.
బౌలింగ్‌ : జశ్‌ప్రీత్‌ బుమ్రా 14-3-30-0, మహ్మద్‌ సిరాజ్‌ 14-3-46-1, రవిచంద్రన్‌ అశ్విన్‌ 17-1-56-0, నవదీప్‌ సైని 7-0-32-1, రవీంద్ర జడేజా 3-2-2-0.

ఏ సెషన్లో ఎన్ని?
తొలి సెషన్‌
పరుగులు : 21
వికెట్లు : 01
ఓవర్లు : 7.1

రెండో సెషన్‌
పరుగులు : 72
వికెట్లు : 00
ఓవర్లు : 23.5

మూడో సెషన్‌
పరుగులు : 73
వికెట్లు : 01
ఓవర్లు : 24

దూకుడుగా ఆడానని అనలేను. అశ్విన్‌ను కొంత సానుకూల దృక్పథంతో ఎదుర్కొన్నాను. అతడిని ఒత్తిడిలో పడేయాలని అనుకున్నాను, ఈ సిరీస్‌లో ఆ పని ఇప్పటివరకు చేయలేదు. బ్యాట్‌ను మరింత బలంగా పట్టుకోవటం వంటి విషయాలపై దృష్టి సారించాను. మంచి పొజిషన్లలో ఆడుతున్నాననే విశ్వాసం కలుగుతోంది. మార్నస్‌ లబుషేన్‌తో భాగస్వామ్యం, ఆత్మవిశ్వాసంతో బౌండరీలు సాధించటం బాగుంది'
- స్టీవ్‌ స్మిత్‌, ఆసీస్‌ బ్యాట్స్‌మన్‌

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

అక్షర్‌ సిక్సర్‌
పటేల్‌ కాదు మోడీ స్టేడియం
గెలుపే లక్ష్యంగా..
మోతెరాకు రాష్ట్రపతి
నేడు ఆడుతున్నాను
రెండు టెస్టులూ గెలుస్తాం!
సచిన్ క్రికెట్ పాఠాలు.. ఫ్రీ..
గులాబీ టర్నర్‌?
ప్రకటనలకు పరిమితులు!
హెచ్‌సీఏ అక్రమాలపై విచారణ జరపాలి
తెవాటియా చితక్కొట్టాడు !
ఐఎస్‌ఎల్‌ తరహాలో ఐపీఎల్‌ !
ఆస్ట్రేలియన్‌ ఓపెన్‌ విజేత జకోవిచ్‌
ఆ విషయంలో భారత్‌ను తప్పుబట్టలేం..!
ఒసాకాదే టైటిల్‌
ఫిట్టా..అన్‌ ఫిట్టా..!
దుమ్ము రేపాడు..
అందుకే వేలం వెర్రి!
ఫైనల్లో మెద్వదేవ్‌
సెరెనా కథ ముగిసే..
జకోవిచ్‌ జోరు
కోట్ల వర్షం కురిసింది
వేలానికి వేళాయే..!
బుల్‌ కు భంగపాటు
స్పిన్‌ దెబ్బకు లెక్క సమం
సెమీస్‌ లో సెరెనా
అశ్విన్‌ అదుర్స్‌
క్వార్టర్స్‌ లో నాదల్‌
చెపాక్‌ మన చేతుల్లో..!
కరీబియన్ల క్లీన్‌ స్వీప్‌

తాజా వార్తలు

09:47 PM

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మోడీ కీలక వ్యాఖ్యలు..

09:41 PM

మాజీ ప్లేయర్​ పీటర్సన్​ను ట్రోల్ చేస్తున్న భారత అభిమానులు

09:33 PM

కలెక్టరేట్ నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయండి : సీఎస్​

09:24 PM

మోడీ త్వరలోనే మాజీ ప్రధాని అవుతారు.. సీఎం షాకింగ్ కామెంట్స్

09:16 PM

కేసీఆర్‌ తీరు బీజేపీతో ఢిల్లీలో దోస్తీ.. గల్లీలో కుస్తీలా ఉంది : జీవన్ రెడ్డి

09:04 PM

కేసీఆర్, జగన్, విజయశాంతిపై షర్మిల సంచలన వ్యాఖ్యలు..

08:58 PM

నోటుకు ఓటు కేసులో కోర్టుకు హాజరైన రేవంత్​రెడ్డి

08:44 PM

సీఎం కీలక నిర్ణయం..1 నుండి 7వ తరగతి విద్యార్ధులకు..

08:32 PM

వామన్ రావు హత్య కేసు.. ప్రభుత్వానికి లేఖ రాసిన గవర్నర్

08:20 PM

క్రికెట్ స్టేడియంకు మోడీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు

08:02 PM

పట్టభద్రుల ఎమ్మెల్సీ నామపత్రాల పరిశీలన పూర్తి

07:54 PM

దిశ చట్టం అంటూ మాయ చేసిన జగన్ : లోకేశ్

07:40 PM

తెలంగాణ విద్యార్ధులు, నిరుద్యోగులతో ముగిసిన షర్మిల భేటీ..

07:23 PM

అమెరికాలో కరోనా విజృంభణ.. బైడెన్ కీలక నిర్ణయం

07:11 PM

గుజరాత్ మున్సిపల్ ఎన్నికల్లో బోణి కొట్టిన ఆమ్‌ ఆద్మీ

07:01 PM

రేపటి నుండి ఆర్టీసీ కార్మికుల సమ్మె.. నిలిచిపోనున్న సర్వీసులు

06:52 PM

ప్రైవేటు బ్యాంకులకు శుభవార్త..

06:44 PM

వామన్‌రావు హత్య కేసు : పోలీసుల కస్టడీలో నిందితులు..

06:40 PM

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

06:34 PM

చెలరేగిన భారత స్పిన్నర్లు.. 112పరుగులకే ఇంగ్లండ్ ఆలౌట్

06:29 PM

నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లావాసులకు హెచ్చరిక..

06:13 PM

ఎనీ వేర్​-ఎనీ టైం సేవలకు గుర్తింపు.. అవార్డు ప్రదానం

06:04 PM

టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఓట్లు అడిగే హక్కు లేదు: ఉత్తమ్​

05:49 PM

కామారెడ్డి జిల్లాలో గొంతు కోసుకుని యువతి ఆత్మహత్య..

05:38 PM

పెరుగుతున్న కేసులు.. రాష్ట్రాలను హెచ్చరించిన కేంద్రం

05:32 PM

పోలీసులు, లిక్కర్ మాఫియాకు మధ్య కాల్పులు.. ఎస్ఐ మృతి

05:22 PM

ఎర్రకోట ముట్టడి ఘటనలో 19 అరెస్టులు, 25 కేసులు : కేంద్రం

05:13 PM

ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు..

05:05 PM

భార్య, కుమార్తెను కాపాడేందుకు ఏకంగా పులితోనే పోరాడి..

04:50 PM

108 సిబ్బందే బంగారం దొంగతనం చేశారు : పోలీసులు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.