Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
భారం బ్యాట్స్‌ మెన్‌ దే! | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Jan 17,2021

భారం బ్యాట్స్‌ మెన్‌ దే!

     గబ్బాలో మన బౌలర్లు గర్జించేందుకు కాస్త సమయం పట్టినా.. బ్యాట్స్‌మెన్‌కు అంత సమయం లేదు. ఆస్ట్రేలియా పేసర్లు నిప్పులు చెరుగుతున్న తరుణంలో భారత బ్యాట్స్‌మెన్‌పైనే భారం నెలకొంది. ఆరంభంలో రోహిత్‌ శర్మ (44) మెరుపులు త్వరగానే ముగిశాయి. పుజారా, రహానె, మయాంక్‌, రిషబ్‌ పంత్‌లు నేడు తమదైన శైలిలో రాణించటంపైనే నిర్ణయాత్మక గబ్బా టెస్టులో భారత్‌ అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. తొలి ఇన్నింగ్స్‌లో 62/2తో కొనసాగుతున్న రహానెసేన.. మరో 307 పరుగుల వెనుకంజలో నిలిచింది. నేడు ఆటలో బ్యాట్స్‌మెన్‌ పోరాటమే గబ్బాలో సిరీస్‌ విజేతను నిర్దేశించనుంది!.
బ్రిస్బేన్‌ (ఆస్ట్రేలియా)
భారత్‌ పోరాడుతోంది. అనుభవ రహిత బౌలింగ్‌ విభాగం ఇబ్బందుల నడుమ, ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో 369 పరుగులకు ఆలౌట్‌ చేసింది. భారీ స్కోరు లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌ దీటుగా బదులిచ్చే ప్రయత్నం చేసింది. ఓపెనర్‌ రోహిత్‌ శర్మ (44, 74 బంతుల్లో 6 ఫోర్లు) దూకుడుతో భారత్‌ అలవోకగా పరుగులు సాధించింది. ఓపెనర్లను ఇద్దరిని కోల్పోయిన భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 62/2తో ఆడుతోంది. తొలుత వర్షం, తర్వాత అవుట్‌ఫీల్డ్‌ తడిగా ఉండటంతో మూడో సెషన్‌ ఆట ఆరంభం కాలేదు. చతేశ్వర్‌ పుజారా (8 బ్యాటింగ్‌, 49 బంతుల్లో), అజింక్య రహానె (2 బ్యాటింగ్‌, 19 బంతుల్లో) అజేయంగా ఆడుతున్నారు. మార్నస్‌ లబుషేన్‌ (108, 204 బంతుల్లో 9 ఫోర్లు) శతకానికి తోడు టిమ్‌ పైనె (50, 104 బంతుల్లో 6 ఫోర్లు), కామెరూన్‌ గ్రీన్‌ (47, 107 బంతుల్లో 6 ఫోర్లు), మాథ్యూ వేడ్‌ (45, 87 బంతుల్లో 6 ఫోర్లు) రాణించటంతో ఆస్ట్రేలియా సిరీస్‌లో అత్యధిక స్కోరు నమోదు చేసింది. భారత అరంగేట్ర పేసర్‌ తంగరసు నటరాజన్‌ (3/78) మూడు వికెట్ల ప్రదర్శనతో రాణించాడు. మరో ఇద్దరు అరంగేట్ర బౌలర్లు షార్దుల్‌ ఠాకూర్‌ (3/94), వాషింగ్టన్‌ సుందర్‌ (3/89) సైతం మూడు వికెట్ల ప్రదర్శనతో మెప్పించారు. వర్షం కారణంగా రెండో రోజు మూడో సెషన్‌ పూర్తిగా వర్షార్పణం కాగా.. భారత్‌ మరో 307 పరుగుల తొలి ఇన్నింగ్స్‌ వెనుకంజలో కొనసాగుతోంది.
తొలి సెషన్‌ : ఇటు పరుగులు, అటు వికెట్లు
ఓవర్‌నైట్‌ స్కోరు 274/5తో బ్యాటింగ్‌ పున ప్రారంభించిన ఆస్ట్రేలియా తొలి సెషన్‌లో విలువైన పరుగులు జతచేసింది. ఓవర్‌నైట్‌ జోడీ టిమ్‌ పైనె (50), కామెరూన్‌ గ్రీన్‌ (47) భాగస్వామ్యం 61 పరుగుల నుంచి 98 పరుగులకు చేరుకుంది. భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్న ఈ జోడీ అర్థ సెంచరీల వైపు దూసుకెళ్లింది. కెప్టెన్‌ టిమ్‌ పైనె 102 బంతుల్లో 6 ఫోర్లతో అర్థ శతకం పూర్తి చేశాడు. అనంతరం ఓ చెత్త షాట్‌ ఆడిన పైనె భారత్‌కు వికెట్ల మార్గం తెరిచాడు. కామెరూన్‌ గ్రీన్‌ సైతం అతడి బాటలోనే నడిచాడు. వాషింగ్టన్‌ సుందర్‌ వలలో చిక్కుకుని వికెట్‌ పారేసుకున్నాడు. టెయిలెండర్లను సాగనంపటంలో భారత బౌలర్ల అనుభవ లేమి స్పష్టంగా కనిపించింది. మరీ ఫుల్‌ లెంగ్త్‌తో, మరీ షార్ట్‌ లెంగ్త్‌తో బంతులు సంధించిన బౌలర్లు పరుగులు ఇచ్చుకున్నారు. మిచెల్‌ స్టార్క్‌ (20, 35 బంతుల్లో 1 సిక్స్‌), నాథన్‌ లయాన్‌ (24, 22 బంతుల్లో 4 ఫోర్లు)లు 40 బంతుల్లోనే 39 పరుగులు జోడించారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ స్కోరును 400 మార్క్‌కు చేరువ చేశారు. లంచ్‌ విరామానికి ముందు అరంగేట్ర బౌలర్లు నటరాజన్‌, షార్దుల్‌ ఠాకూర్‌, వాషింగ్టన్‌ సుందర్‌లు తోకను కత్తిరించారు. 369 పరుగుల వద్ద ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌కు తెరపడింది.
రెండో సెషన్‌ : ఆరంభం అదిరినా..!
తొలి సెషన్‌లో ఆస్ట్రేలియా చివరి ఐదు వికెట్లను 28.1 ఓవర్లలో తీసేసిన భారత్‌.. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాట్‌తోనూ దీటుగా బదులిచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లు భారత ఓపెనర్లకు పక్కా ప్రణాళికలతో వచ్చారు. తొలి ఆరు ఓవర్లలో మిచెల్‌ స్టార్క్‌, జోశ్‌ హజిల్‌వుడ్‌, పాట్‌ కమిన్స్‌లను రోహిత్‌ శర్మ (44), శుభ్‌మన్‌ గిల్‌ (7) అలవోకగా ఎదుర్కొన్నారు. కుడి చేతి బ్యాట్స్‌మెన్‌ను కారిడార్‌ దిశగా షాట్లు ఆడేలా ఇన్‌వార్డ్‌ యాంగిల్‌లో పాట్‌ కమిన్స్‌ బంతులు విసిరాడు. ఇక్కడ అవుట్‌సైడ్‌ ఎడ్జ్‌తో స్లిప్స్‌లో క్యాచుల కోసం ఆసీస్‌ పన్నాగం. శుభ్‌మన్‌ గిల్‌పై పాట్‌ కమిన్స్‌ ఈ వ్యూహంతో విజయవంతమయ్యాడు. రెండో స్లిప్స్‌లో ఎడ్జ్‌తో గిల్‌ వికెట్‌ కోల్పోయాడు. తర్వాతి బంతికి చతేశ్వర్‌ పుజారా సైతం అదే తరహాలో వికెట్‌ కోల్పోయే ప్రమాదం నుంచి తృటిలో బయటపడ్డాడు. స్లిప్స్‌ ఫీల్డర్‌కు కాస్త ముందు బంతి పడటంతో పుజారా బతికిపోయాడు. మరో వైపు రోహిత్‌ శర్మ ఆసీస్‌ బౌలర్లను సులువుగా ఆడుకున్నాడు. ఆరు ఫోర్లతో 44 పరుగులు పిండుకున్నాడు. నాథన్‌ లయాన్‌ బౌలింగ్‌లో గుంజి కొట్టేందుకు క్రీజు వదిలిన రోహిత్‌ శర్మ మళ్లీ క్రీజులోకి రాలేదు. స్టీవ్‌ స్మిత్‌ క్యాచ్‌ అందుకోవటంతో వికెట్‌ కోల్పోయాడు. ఆ బంతి ముందు వరకూ రోహిత్‌ శర్మ దూకుడుగా ఆడాడు. అతడు మ్యాచ్‌ను మలుపు తిప్పే ఇన్నింగ్స్‌ ఆడతాడనే అంచనాలు ఉన్నాయి. కానీ లయాన్‌ గతంలో రోహిత్‌పై ప్రయోగించిన ఫార్ములానే ఉపయోగించి అతడిని ఊరించాడు. వికెట్‌ సాధించాడు. పుజారా (8)తో కలిసి రహానె (2) రెండో సెషన్‌లో మరో వికెట్‌ పడనివ్వలేదు. వర్షం అంతరాయంతో ముందుగానే టీ విరామం వచ్చేసింది. ఆ సమయానికి భారత్‌ 62/2తో నిలిచింది. రోహిత్‌ శర్మ అవుటైన తర్వాత భారత్‌ 37 బంతుల్లో 2 పరుగులే చేయగల్గింది.
మూడో సెషన్‌ : పూర్తిగా వర్షార్పణం
చివరి టెస్టు రెండో రోజు మూడో సెషన్‌ ఆట పూర్తిగా వర్షార్పణం అయ్యింది. చిరు జల్లులతో మొదలైన వర్షం.. కుంభవృష్టితో అవుట్‌ ఫీల్డ్‌ను చిత్తడి చేసింది. గబ్బా పిచ్‌ చిన్నపాటి సరస్సులా తయారైంది. భారీ వర్షం కురిసినా.. గబ్బా పిచ్‌ ఆధునాతన సౌకర్యంతో మ్యాచ్‌ను నిమిషాల వ్యవధిలోనే ఆరంభించగలరనే నమ్మకం అందరిలోనూ కనిపించింది. కానీ ఇసుకతో కూడిన అవుట్‌ఫీల్డ్‌ మరీ తడిగా ఉండటంతో అంపైర్లు మూడో సెషన్‌ ఆటను రద్దు చేశారు. దీంతో మూడో సెషన్లో ఒక్క బంతీ పడకుండానే రెండో రోజు ఆట ముగిసింది. మూడో సెషన్లో నష్టపోయిన ఆట కారణంగా.. నేడు ఉదయం సెషన్‌ అర గంట ముందుగానే మొదలు కానుంది. నేడు ఉదయం భారత కాలమానం ప్రకారం 4.30 గంటలకు మూడో రోజు ఆట ఆరంభం కానుంది. చతేశ్వర్‌ పుజారా, అజింక్య రహానె, మయాంక్‌ అగర్వాల్‌, రిషబ్‌ పంత్‌ సహా టెయిలెండర్లలో వాషింగ్టన్‌ సుందర్‌, షార్దుల్‌ ఠాకూర్‌ బ్యాటింగ్‌పై భారత్‌ భారీగా ఆధారపడింది. అందరూ మెరిస్తే తొలి ఇన్నింగ్స్‌లో భారత్‌ అనుకున్నంత స్కోరు చేసేందుకు అవకాశం చిక్కనుంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ : డెవిడ్‌ వార్నర్‌ (సి) రోహిత్‌ (బి) సిరాజ్‌ 1, మార్కస్‌ హారిశ్‌ (సి) వాషింగ్టన్‌ (బి) ఠాకూర్‌ 5, మార్నస్‌ లబుషేన్‌ (సి) రిషబ్‌ పంత్‌ (బి) నటరాజన్‌ 108, స్టీవ్‌ స్మిత్‌ (సి) రోహిత్‌ (బి) వాషింగ్టన్‌ 36, మాథ్యూ వేడ్‌ (సి) ఠాకూర్‌ (బి) నటరాజన్‌ 45, కామెరూన్‌ గ్రీన్‌ (బి) వాషింగ్టన్‌ 47, టిమ్‌ పైనె (సి) రోహిత్‌ (బి) ఠాకూర్‌ 50, కమిన్స్‌ (ఎల్బీ) ఠాకూర్‌ 2, స్టార్క్‌ నాటౌట్‌ 20, లయాన్‌ (బి) వాషింగ్టన్‌ 24, హజిల్‌వుడ్‌ (బి) నటరాజన్‌ 11, ఎక్స్‌ట్రాలు : 20, మొత్తం : (115.2 ఓవర్లలో ఆలౌట్‌) 369.
వికెట్ల పతనం : 1-4, 2-17, 3-87, 4-200, 5-213, 6-311, 7-313, 8-315, 9-354, 10-369.
బౌలింగ్‌ : మహ్మద్‌ సిరాజ్‌ 28-10-77-1, నటరాజన్‌ 24.2-3-78-3, షార్దుల్‌ ఠాకూర్‌ 24-6-94-3, నవదీప్‌ సైని 7.5-2-21-0, వాషింగ్టన్‌ సుందర్‌ 31-6-89-3, రోహిత్‌ శర్మ 0.1-0-1-0.
భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ : రోహిత్‌ శర్మ (సి) మిచెల్‌ స్టార్క్‌ (బి) నాథన్‌ లయాన్‌ 44, శుభ్‌మన్‌ గిల్‌ (సి) స్టీవ్‌ స్మిత్‌ (బి) పాట్‌ కమిన్స్‌ 7, చతేశ్వర్‌ పుజారా బ్యాటింగ్‌ 8, అజింక్య రహానె బ్యాటింగ్‌ 2, ఎక్స్‌ట్రాలు : 01, మొత్తం : (26 ఓవర్లలో 2 వికెట్లకు) 62.
వికెట్ల పతనం : 1-11, 2-60.
బౌలింగ్‌ : మిచెల్‌ స్టార్క్‌ 3-1-8-0, జోశ్‌ హజిల్‌వుడ్‌ 8-4-11-0, పాట్‌ కమిన్స్‌ 61-22-1, కామెరూన్‌ గ్రీన్‌ 3-0-11-0, నాథన్‌ లయాన్‌ 6-2-10-1.
సెషన్ల వారీగా..
తొలి సెషన్‌
పరుగులు : 95
వికెట్లు : 05
ఓవర్లు : 28.1
రెండో సెషన్‌
పరుగులు : 62
వికెట్లు : 02
ఓవర్లు : 26

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

టీ గోల్ఫ్‌ టోర్నీ విజయవంతం
లార్డ్స్‌ కాదు సౌతాంప్టన్‌
ముగ్గురు మొనగాళ్లు
ఖాళీ స్టేడియాల్లోనే..!
మిథాలీ మెరిసినా..
కివీస్‌ దే సిరీస్‌
దర్జాగా లార్డ్స్‌ కు...
ఫైనల్లో సింధు ...
పంత్‌ శతక నాదం
ఫించ్‌ మెరుపులు
మన పని వరకే చూసుకుందాం!
అక్షర్‌, అశ్విన్‌ మాయ
ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు
పీఎస్‌ఎల్‌ వాయిదా
లార్డ్స్‌ పై కన్నేసి..!
ఎలా పొగడగలను?
నెలాఖరుకు నిర్ణయం!
ముంబయి ఔట్‌?!
త్వరలోనే 'సూపర్‌' సాధన
పిచ్‌లో మార్పు ఉండదు
ఐపీఎల్‌ లో క్రికెట్‌కు విలువ లేదు
మొతెరాలో మరో టర్నర్‌!
మణివి మతిలేని వ్యాఖ్యలు
జట్టులో నమ్మకాన్ని నింపాడు
పిచ్‌ లపై ఎందుకీ ఏడుపు?
రోజర్‌ సరసన జకో
లోపం అక్కడుంది!
ఐపీఎల్‌ మ్యాచులు పెట్టండి
అశ్విన్‌ 3, రోహిత్‌ 8
పిచ్చి పిచ్చిగా పిచ్‌

తాజా వార్తలు

12:54 PM

ఉభ‌య‌స‌భ‌లు మధ్యాహ్నం 2గంటలకు వ‌ర‌కు వాయిదా

12:37 PM

వరుసగా 4రోజుల పాటు బ్యాంకుల మూసివేత

12:13 PM

హౌరా రూరల్ ఎస్పీపై ఈసీ వేటు

12:00 PM

తల్లి నగ్న ఫొటోలు చూపించి..కూతురిపై లైంగికదాడి

11:45 AM

యాచకుడు మృతి..చేతి సంచిలో భారీగా డబ్బు చూసి షాక్

11:28 AM

సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌ ప్లాట్‌ఫామ్ టికెట్ ధ‌ర భారీగా పెంపు

11:17 AM

లాభాల్లో కొన‌సాగుతున్న‌ స్టాక్ మార్కెట్లు

11:07 AM

మరో రెండు రోజులు బ్యాంక్ OTP, ఇతర SMSలు రాకపోవచ్చు..!

10:57 AM

హైద‌రాబాద్‌లో యువ‌తి ఆత్మ‌హ‌త్య‌

10:46 AM

తిరుచ్చి ఎయిర్‌పోర్టు‌లో రూ.73ల‌క్ష‌ల బంగారం ప‌ట్టి‌వేత‌

10:44 AM

దేశంలో కొత్తగా 15,388 కొవిడ్‌ కేసులు

10:38 AM

వేలంలో రూ.510కోట్లు ప‌లికిన వైన్‌షాప్‌

10:28 AM

ములుగులో చిరుత కలకలం

10:25 AM

భారీగా పతనమైన బంగారం ధర..!

10:01 AM

తెలంగాణ‌లో క‌రోనా కేసుల అప్‌డేట్స్‌!

09:57 AM

కొత్తగా స్కూటర్‌కొనే వారికి బంపరాఫర్..!

09:46 AM

37 రోజుల ప‌సిబిడ్డ‌కు క‌రోనా పాజిటివ్

08:52 AM

రాత్రి నుంచి రోడ్లపైనే విశాఖ స్టీల్‌ప్లాంట్ కార్మికులు!

08:38 AM

వ‌రంగ‌ల్ దారుణం..భార్య‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి..!

08:27 AM

చెట్టుపై తలపడిన చిరుతపులి..నల్ల చిరుతపులి

08:16 AM

రాజాసింగ్‌పై ఓయూ పీఎస్‌లో మరో ఫిర్యాదు

08:05 AM

అత్తింటిలో మహిళపై వేధింపుల కేసులో సుప్రీంకోర్టు సంచలన తీర్పు

07:47 AM

నేడు డీఎండీకే కార్యదర్శుల సమావేశం

07:42 AM

విజయవాడలో ఫ్లయింగ్ స్క్వాడ్ దాడులు భారీగా నగదు స్వాధీనం

07:29 AM

అనుంతపురంలో ఒకే కుటుంబంలో ముగ్గురి ఆత్మహత్య

07:24 AM

28న ఎన్టీఆర్‌ ట్రస్ట్‌ స్కాలర్‌షిప్‌ పరీక్ష

07:20 AM

కొడవలితో భార్యను ముక్కలుగా నరికి..!

07:01 AM

ఒకే యువతిని ప్రేమించిన అన్నదమ్ములు..!

06:42 AM

హిందూపురంలో ఎమ్మెల్యే బాలకృష్ణకు చేదు అనుభవం

06:36 AM

గూడ్స్‌ రైలు ఢీకొని పులి పిల్ల మృతి

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.