Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజేతలకు ఎమ్మెల్సీ కవిత బహుమతుల ప్రదానం
నవతెలంగాణ, హైదరాబాద్ : అజయ్ భారతి, దీపక్, ప్రసాద్ రావు, చాముండేశ్వర్ నాథ్‌లు టీ గోల్ఫ్ ఆరంభ టోర్నీ విజేతలుగా నిలిచారు. టీ స్పోర్ట్స్, టీ గోల్ఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో వంద మందికి పైగా గోల్ఫర్లు పోటీపడ్డారు. అండర్-15 విభాగంలో అజయ్ భారతి విజేతగా నిలువగా.. రుషీల్ రెడ్డి రన్నరప్‌గా నిలిచాడు. 16 ప్లస్ విభాగంలో దీపక్ సింగ్ టైటిల్ సొంతం చేసుకున్నాడు. డాక్టర్ సమీర్ మహేంద్ర రెండో స్థానం సాధించారు. సీనియర్ విభాగంలో కోటగిరి ప్రసాద రావు విజేతగా నిలువగా.. ఓవరల్‌గా చాంపియన్‌గా చాముండేశ్వర్‌నాథ్, ఓవరాల్ రన్నరప్‌గా జేపీ రెడ్డి నిలిచారు. క్లోజెస్ట్ పిన్ అవార్డును సి. శశిధర్, స్ట్రెయిటెస్ట్ డ్రైవ్ అవార్డును రామ్ మాండవ, లాంగెస్ట్ డ్రైవ్ అవార్డును జెర్సీ అండర్సన్ గెలుచుకున్నారు. విలోక్ గద్వాల్, శ్రీహిత మాండవలు బెస్ట్ గ్రాస్ అవార్డులను అందుకున్నారు. టీ గోల్ఫ్ టోర్నీ విజేతలకు ముఖ్య అతిథులు ఎమ్మెల్సీ కల్లకుంట్ల కవిత, హెచ్‌సీఏ అధ్యక్షుడు, భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్, బ్యాడ్మింటన్ జాతీయ చీఫ్ కోచ్ పుల్లెల గోపీచంద్‌లు బహుమతులు ప్రదానం చేశారు. కార్యక్రమంలో టీ స్పోర్ట్స్ చైర్మన్ ఎ. జగన్మోహన్ రావు, టీ గోల్ఫ్ అధ్యక్షుడు ఎన్‌ఆర్‌ఎన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.