Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
ఫెన్సింగ్ క్రీడాఎంతో నైపుణ్యంతో కూడుకున్నదని సాట్స్ చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. శనివారం అంతర్జాతీయ ఫెన్సింగ్ దినోత్సవ వేడుకలు నెక్లెస్‌రోడ్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడారు. ఫెన్సింగ్ క్రీడా ప్రమాదకరమైనదనీ, అయినా క్రీడాకారులు ఇలాంటి క్రీడను ఎంచుకోవడం అభినందనీయమని తెలిపారు. రాష్ట్రంలోని అనేక మంది ఫెన్సింగ్ క్రీడాకారులున్నారనీ, వీరందరికీ క్రమశిక్షణతో కూడిన శిక్షణ ఇస్తే జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధిస్తారని ఆశాభావం వక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఫెన్సింగ్ అడ్‌హక్ కమిటీ సభ్యులు సంజరుకుమార్, సాట్స్ కోచ్‌లు భానుప్రకాశ్, శ్రీవిద్య తదితరులు పాల్గొన్నారు.