Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రేసులో నిలిచేదెవరు? | క్రీడలు | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • క్రీడలు
  • ➲
  • స్టోరి
  • Dec 05,2019

రేసులో నిలిచేదెవరు?

- టీ20 వరల్డ్‌కప్‌ జట్టులో చోటు కోసం పోటీ
- ప్రతి మ్యాచ్‌ ప్రదర్శన కీలకమే
నవతెలంగాణ-హైదరాబాద్‌
2019 ప్రపంచకప్‌ నిష్క్రమణ నుంచి తేరుకున్న టీమ్‌ ఇండియా.. మరో వరల్డ్‌కప్‌ వేటకు సిద్ధమవుతోంది. ఆస్ట్రేలియాలో జరుగనున్న 2020 టీ20 ప్రపంచకప్‌కు భారత్‌ సన్నాహకం అప్పుడే మొదలైంది. బ్యాటింగ్‌ లైనప్‌లో టాప్‌ ఆర్డర్‌ ఎలా ఉండాలి, మిడిల్‌ ఆర్డర్‌ పాత్ర ఎలా ఉండాలి అనే అంశాలపై జట్టు మేనేజ్‌మెంట్‌ ఓ స్పష్టతతో ఉంది. ధనాధన్‌ వరల్డ్‌కప్‌ వేట కావటంతో బౌలింగ్‌ లైనప్‌ సైతం బ్యాట్‌తో సత్తా చాటాల్సిన అవసరం ఉంటుందని కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి ఇప్పటికే తన ప్రాధమ్యాన్ని వెల్లడించాడు. భారత్‌ 2016 టీ20 ప్రపంచకప్‌లో సెమీఫైనల్లో నిష్క్రమించింది. 2016 టీ20 వరల్డ్‌కప్‌ తర్వాత 20 ఓవర్ల ఫార్మాట్‌లో టీమ్‌ ఇండియా ఏకంగా 45 మంది ఆటగాళ్లను బరిలోకి దింపింది. టీ20 ప్రపంచకప్‌కు ఏడాది కంటే తక్కువ సమయం ఉన్న తరుణంలో ప్రపంచకప్‌ జట్టు కూర్పు ఎలా ఉండాలనే విషయంపై ఇప్పుడు విపరీతమైన చర్చ నడుస్తోంది. స్వదేశంలో వెస్టిండీస్‌తో భారత్‌ మూడు మ్యాచుల టీ20 సవాల్‌కు రంగం సిద్ధం చేసుకుంది. 2020 టీ20 ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం చేసుకుని కొందరు ఆటగాళ్లు విండీస్‌పై దీమాగా బరిలోకి దిగుతున్నారు. మరికొందరు తామూ వరల్డ్‌కప్‌ జట్టులో ఉండేందుకు అర్హులమే అని చాటేందుకు కసితో కదం తొక్కనున్నారు. పొట్టి ఫార్మాట్‌లో ఎప్పటికీ వెస్టిండీస్‌ బలమైన జట్టుగానే నిలుస్తుంది. 20 ఓవర్ల ఆటలో విండీస్‌కు లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ ఉంది. బౌలింగ్‌లోనూ కరీబియన్లది మెరుగైన బృందం. వెస్టిండీస్‌తో టీ20 సవాల్‌లో సిరీస్‌ ఫలితంపై ఎవరికీ అనుమానం లేదు. కానీ వ్యక్తిగత ప్రదర్శనలతో ఎవరు వరల్డ్‌కప్‌ జట్టులో నిలిచేందుకు సెలక్టర్ల దృష్టిని ఆకట్టుకుంటారనేది కీలకంగా మారింది.
2020 ప్రపంచకప్‌ జట్టులో సుమారు 8 మంది ఆటగాళ్లు తమ స్థానాలను ఖాయం చేసుకున్నారని చెప్పవచ్చు. 15 మందితో కూడిన వరల్డ్‌కప్‌ జట్టులో ఇంకో ఏడు స్థానాలపైనే పీట ముడి కొనసాగుతోంది. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సహా కెఎల్‌ రాహుల్‌, శ్రేయాష్‌ అయ్యర్‌లు బ్యాటింగ్‌ లైనప్‌లో స్థానాలు ఖాయం చేసుకున్నారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యకు అసలు పోటీ లేదు. బౌలింగ్‌ విభాగంలో జశ్‌ప్రీత్‌ బుమ్రా, దీపక్‌ చాహర్‌ సహా స్పిన్నర్‌ యుజ్వెంద్ర చాహల్‌లు ఆస్ట్రేలియా విమానం ఎక్కటం లాంఛనమే. జట్టు కీలక ఆటగాళ్లను మినహాయిస్తే శ్రేయాష్‌ అయ్యర్‌ ఒక్కడే ఇటీవల నిలకడగా రాణిస్తూ ప్రపంచకప్‌ జట్టులో చోటు ఖాయం చేసుకున్నాడు!. ఏడు టీ20ల్లోనే ఆడిన శ్రేయాష్‌ అయ్యర్‌ తన నైపుణ్యంతో పొట్టి జట్టులో కీలకంగా ఎదిగాడు. గాయంతో కొంత కాలంగా ఆటకు దూరమైన హార్దిక్‌ పాండ్య పూర్తి ఫిట్‌నెస్‌ సాధించగానే నేరుగా జట్టులోకి రానున్నాడు. హార్దిక్‌ పాండ్యకు పోటీనిచ్చే ఆల్‌రౌండర్‌ను భారత్‌ ఇంకా దొరకబుచ్చుకోలేదు.
ఏడు స్థానాల కోసం పోటీపడుతున్న జాబితా కొంత పెద్దగానే కనిపిస్తోంది. బ్యాటింగ్‌ లైనప్‌లో శిఖర్‌ ధావన్‌, మనీశ్‌ పాండే, రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌ సహా ఎం.ఎస్‌ ధోని రేసులో ఉన్నారు. ఆల్‌రౌండర్ల కోటాలో శివం దూబె, కృనాల్‌ పాండ్య, రవీంద్ర జడేజా, వాషింగ్టన్‌ సుందర్‌లు ఆశల పల్లకిలో కొనసాగుతున్నారు. స్పిన్‌ విభాగంలో కుల్దీప్‌ యాదవ్‌ ముందు వరుసలో నిల్చుకున్నాడు. రాహుల్‌ చాహర్‌ సైతం పోటీ పడుతున్నాడు. భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి, నవదీప్‌ సైని పేస్‌ బాధ్యతలు పంచుకునేందుకు ఎదురుచూస్తున్నారు. కుల్దీప్‌ యాదవ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, శిఖర్‌ ధావన్‌, రవీంద్ర జడేజాలు ప్రపంచకప్‌ జట్టుకు ఓ మంచి ప్రదర్శన దూరంలో ఉన్నారు. రిషబ్‌ పంత్‌కు సంజూ శాంసన్‌ నుంచి గట్టి పోటీ ఎదురు కానుంది. అయితే, ముందుగా తనను తాను నిరూపించుకునేందుకు సంజూ శాంసన్‌కు ఓ అవకాశం దక్కాలి. రెగ్యులర్‌ ఓపెనర్‌ శిఖర్‌ ధావన్‌ స్థానంలో జట్టులోకి వచ్చిన సంజూ శాంసన్‌ను జట్టు మేనేజ్‌మెంట్‌ ఓపెనర్‌గా పరిగణనలోకి తీసుకుంటేనే అతడు వెస్టిండీస్‌తో తుది జట్టులో నిలిచే అవకాశం ఉంది. మనీశ్‌ పాండే ఇటీవలే సయ్యద్‌ ముస్తాక్‌ అలీ టీ20 ఫైనల్లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మిడిల్‌ ఆర్డర్‌ బ్యాట్స్‌మన్‌గా మెరుగైన మనీశ్‌ పాండే సైతం ప్రపంచకప్‌ జట్టుకు ఓ మంచి ప్రదర్శన దూరంలోనే ఉన్నాడని చెప్పవచ్చు.
వెస్టిండీస్‌తో తాజా సిరీస్‌లో రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, మనీశ్‌ పాండేలు ప్రపంచకప్‌ జట్టు ఎంపికను దృష్టిలో ఉంచుకుని ఆడాల్సి ఉంటుంది. వెస్టిండీస్‌ సిరీస్‌తో పాటు రానున్న న్యూజిలాండ్‌ పర్యటనలో ఐదు టీ20ల్లోనూ నిలకడ సాధిస్తే ఈ ముగ్గురికీ వరల్డ్‌కప్‌ బెర్త్‌ లభించే అవకాశం ఉంది. పేసర్లు భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమి సైతం టీ20ల్లోనూ ప్రభావశీల బౌలర్లుగా నిరూపించుకునేందుకు వెస్టిండీస్‌తో సిరీస్‌ ఓ వేదిక. బంగ్లాదేశ్‌తో సిరీస్‌లో నిరాశపరిచిన శివం దూబెకు సైతం విండీస్‌పై మంచి అవకాశం లభించనుంది. ధనాధన్‌ హిట్టర్‌గా శివం తనేంటో క్రికెట్‌ ప్రపంచానికి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు.
ప్రాక్టీస్‌ ప్రాక్టీస్‌.. :
భారత్‌, వెస్టిండీస్‌ ఉప్పల్‌ స్టేడియంలో శుక్రవారం తొలి టీ20 పోరులో తలపడనున్నాయి. మంగళవారం హైదరాబాద్‌కు చేరుకున్న టీమ్‌ ఇండియా బుధవారం ప్రాక్టీస్‌ మొదలు పెట్టింది. వెస్టిండీస్‌ ఓ రోజు ముందుగానే సాధన ఆరంభించిన సంగతి తెలిసిందే. టీమ్‌ ఇండియా నెట్స్‌లో కఠోరంగా శ్రమించింది. యువ ఆటగాళ్లు రిషబ్‌ పంత్‌, సంజూ శాంసన్‌, శివం దూబెలు ఎక్కువగా బ్యాటింగ్‌పై దృష్టి సారించారు. ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్‌ నెట్స్‌లో భారీ షాట్లను ఎక్కువగా సాధన చేశారు. కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి, వైస్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మలు సైతం నెట్స్‌లో బ్యాటింగ్‌ సాధన చేశారు. అంతకముందు జట్టు రోటిన్‌ కసరత్తులు ముగించుకుంది. ప్రధాన పిచ్‌కు సమీపంలో రిషబ్‌ పంత్‌ వికెట్‌ కీపింగ్‌ ప్రాక్టీస్‌ చేశాడు. కోచ్‌ పంత్‌కు క్యాచింగ్‌ ప్రాక్టీస్‌లో సహాయం చేశారు. ఉదయం సెషన్లో వెస్టిండీస్‌ జట్టు సైతం నెట్స్‌లో చెమటోడ్చింది. కెప్టెన్‌ కీరన్‌ పొలార్డ్‌ బ్యాట్‌తో భారీ షాట్లు సాధన చేశాడు. మ్యాచ్‌కు ముందు రోజు నేడు సైతం ఇరు జట్లు ఉప్పల్‌ మైదానంలో ప్రాక్టీస్‌ సెషన్లో పాల్గొననున్నాయి.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఒకే బ్యాట్స్‌మెన్.. ఒకే బంతికి.. రెండు సార్లు రనౌట్
బౌన్సర్లకు భయపడేవాడిని!
మా లక్ష్యం గెలుపే
అది భారత్‌ కు అగౌరవం
అరంగేట్రం ఊహించలేదు
బౌలర్లది భయమెరుగని సిద్ధాంతం
బౌలింగ్‌ ఆల్‌రౌండర్‌ను!
యాషెస్‌ వ్యామోహం వదిలేయండి!
పంత్‌ నెమ్మదిగా నేర్చుకుంటాడు
సెమీస్‌లో సాత్విక్‌, అశ్విని జోడీ
ఫిబ్రవరి 18న వేలం
జట్టుకు డ్రా రుణపడ్డానన్నారు
ఇదే జోరు చూపిస్తాను!
వెనకుండి.. నడిపించెన్‌!
గబ్బా కోట బద్దలు
నా జీవితంలో ఇది అతిపెద్ద సంఘటన.
టెస్టు క్రికెట్‌లో ఇది కఠినమైన రోజు
ఈ విజయం మాకెంతో ప్రత్యేకం!
క్లైమాక్స్‌ కు వర్షం అడ్డంకి?
అటో..ఇటో..ఎటో!
తోక ప్రతాపం
ఆసీస్‌పైనే ఒత్తిడి!
భారం బ్యాట్స్‌ మెన్‌ దే!
నేడు అపెక్స్‌ కౌన్సిల్‌ భేటీ
కంగారూ జోరు!
ఒక్క బంతికి రెండు దెబ్బలు
రంజీ జరిగేనా?!
సేవలు పున ప్రారంభం?
సిరాజ్‌ ఆ పని చేశాడు
బుమ్రాకు గాయం?

తాజా వార్తలు

06:09 PM

100, 10, 5 నోట్ల ర‌ద్దు‌పై స్పందించిన‌ ఆర్బీఐ

06:08 PM

రైతుల నుండి బలవంతపు భూసేకరణను వెంటనే ఆపాలి..

05:57 PM

కరోనా టీకాపై తప్పుడు ప్రచారం చేస్తే కఠిన చర్యలు : కేంద్రం

05:52 PM

క్షుద్రపూజలకు కన్నకూతుర్లనే బలిచేసారు : నాగేశ్వ‌ర్ విశ్లే‌ష‌ణ‌

05:43 PM

ఏప్రిల్ చివర్లో బిగ్‌బాస్-5.. కంటెస్టెంట్లుగా యాంకర్, హైపర్..!

05:37 PM

కోట్ల ఆస్తి.. పది మంది భార్యలు..గొంతుకోసి చంపేశారు

05:30 PM

ఆడ పిల్లలకు చదువు అత్యంత ఆవశ్యకం : సత్యవతి రాథోడ్

05:22 PM

తృటిలో తప్పిన ఘోర ప్రమాదం..

05:12 PM

ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును గౌరవించాలి : రాష్ట్ర్రపతి

04:33 PM

పంజాబ్ నుంచి ఢిల్లీ వరకు ట్రాక్టర్ ను రివర్స్ గేర్ లో నడిపిన రైతు..

04:32 PM

భార్య చేసిన ప‌నికి భర్త ఆత్మహత్య..

04:20 PM

నిలకడగా శశికళ ఆరోగ్య పరిస్థితి..

04:12 PM

అసదుద్దీన్ ఒవైసీకి నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ

03:58 PM

ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు కేంద్ర పతకాలు..

03:51 PM

భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు...

03:45 PM

పెళ్లి స‌మ‌యంలో నిహారిక ‌కన్నీరు..వైర‌ల్‌ అవుతున్న వీడియో

03:42 PM

నటి, బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ ఆత్మహత్య..

03:28 PM

ఎప్పటికీ కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేయరు..

03:24 PM

కాంగ్రెస్ పార్టీకి షాక్.. ఎమ్మెల్యేల రాజీనామా

03:13 PM

ఏపీలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందే: సుప్రీం

03:09 PM

పంచాయతీ ఎన్నికలను రీషెడ్యూలు చేసిన ఎస్ఈసీ

03:08 PM

క‌రోనా పాజిటివ్.. ఇన్‌కం ట్యాక్స్ అధికారి అత్మ‌హ‌త్య

02:24 PM

ఓ అభిమాని పెండ్లికి హాజరైన హీరో సూర్య..

02:19 PM

అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్న జీహెచ్ఎంసీ అధికారులు..

02:17 PM

ఇద్దరు కూతుళ్ల హత్య కేసులో కొత్త ట్విస్టు

02:11 PM

అత్తారింటి ముందు మౌన దీక్షకు దిగిన కోడలు..

02:08 PM

పంచాయతీ ఎన్నికలపై సుప్రీంలో విచారణ

02:02 PM

27న భారత్​కు ఇంగ్లాండ్​ జట్టు.. నేరుగా క్వారంటైన్​కు..

01:56 PM

నగరంలో రైతుల పరేడ్‌కు అనుమతి కోరుతూ హైకోర్టులో పిల్

01:51 PM

విజయలక్ష్మీ కుటుంబానికి రూ.50లక్షల నష్ట పరిహారం : ఆళ్ల నాని

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.