Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడు దేశాల జూనియర్ హాకీ టోర్ని
కాన్‌బెర్రా : మూడు దేశాల హాకీ టోర్నమెంట్‌లో భారత జూనియర్ మహిళల హాకీ జట్టు విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన టోర్ని చివరి మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఆస్ట్రేలియా చేతిలో భారత అమ్మాయిలు పరాజయం చవిచూసినా, పాయింట్ల పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచి టోర్ని విజేతగా నిలిచారు.ఆదివారం మ్యాచ్‌లో భారత్‌పై ఆస్ట్రేలియా 2-1 గోల్స్‌తో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలి 15 నిమిషాల్లోనే గోల్ చేసి ఆసీస్ అధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఆట 53వ నిమిషంలో గగన్‌దీప్ కౌర్ గోల్ చేయడంతో భారత్ స్కోరును సమయం చేసింది. అయితే తరువాత వెంటనే 56వ నిమిషంలో ఆసీస్ మరో గోల్ చేసింది. చివరికి మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. చివరి మ్యాచ్‌లో భారత్ ఓటమి చెందినా, పాయింట్ల పట్టికలో మాత్రం ఆగ్రస్థానంలో నిలిచింది. నాలుగు మ్యాచ్‌ల్లోనూ ఏడు పాయింట్లతో భారత్ పట్టికలో ఆగ్రస్థానంలో నిలిచింది. ఆతిథ్య ఆస్ట్రేలియా కంటే ఒక గోల్ ఎక్కువ చేసిన భారత్ ఆగ్రస్థానాన్ని సొంతం చేసుకుంది. ఈ టోర్నిలో మరో జట్టు న్యూజిలాండ్ నాలుగు మ్యాచ్‌ల్లో మూడు పాయిం ట్లు మాత్రమే సాధించింది. చివరి స్థానంలో నిలిచింది.