Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేటి నుంచి వరల్డ్ టూర్ ఫైనల్స్
గాంగ్జౌ (చైనా) : ఈ ఏడాది ఆగస్టులో బ్యాడ్మింటన్ ప్రపంచ చాంపియన్‌గా నిలిచి చరిత్ర సృష్టించింది పి.వి సింధు. చారిత్రక విజయానంతరం ఆశ్చర్యకరంగా సింధు ప్రదర్శన తిరోగమనంలోకి ప్రవేశించింది. వరుసగా టోర్నీలలో క్వార్టర్‌ఫైనల్స్‌కు ముందే నిష్క్రమిం చింది. వరల్డ్ చాంపియన్‌షిప్స్ గెలుపు తర్వాత వరుసగా ఆరు టోర్నీలలో సింధు నిరాశపరిచింది. ప్రపంచ శ్రేణి షట్లర్లతో తలపడినప్పుడు అత్యుత్తమ ప్రదర్శన చేయటం సింధు సహజ లక్షణం. అందుకే తాజా ఫామ్‌తో నిమిత్తం లేకుండా బిడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ నిలుపుకునేందుకు పి.వి సింధు రంగం సిద్ధం చేసుకుంది. చైనాలోని గాంగ్జౌ వేదికగా బ్యాడ్మింటన్ వరల్డ్ టూర్ ఫైనల్స్ బుధవారం నుంచి ఆరంభం కానుంది. భారత్ నుంచి పి.వి సింధు వైల్డ్ కార్డ్ ఎంట్రీతో టోర్నీలో పాల్గొంటుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ఎవరూ ఆర్హత సాధించలేదు. ప్రతి ఏడాది ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్-8 క్రీడాకారులు వరల్డ్ టూర్ ఫైనల్స్ టైటిల్ కోసం పోటీపడతారు. మహిళల సింగిల్స్ డ్రాలో గ్రూప్-ఏలో సింధు చోటుచేసుకుంది. చైనా క్రీడాకారిణి చెన్ యుఫెరు, జపాన్ స్టార్ అకానె యమగూచి, చైనా యువ సంచలనం హీ బింగ్జియావ్‌లతో సింధు గ్రూప్ దశలో పోటీపడనుంది. గ్రూప్-బిలో రచనోక్ ఇంటనాన్, నజొమి ఒకుహర, తైజు యింగ్, బుసానన్‌లో పోటీపడుతున్నారు. ' వరల్డ్ టూర్ ఫైనల్స్ రేసులో ఉన్న షట్లర్లు అందరూ ఫామ్‌లో ఉన్నారని అనుకుంటున్నా. ఒకుహర నిలకడగా బాగా ఆడుతుంది. ఒకుహర కాకుండా తైజు యింగ్, చెన్ యుఫెరులు మంచి ఫామ్‌లో ఉన్నారు. ఇది కష్టమని, సులభమని చెప్పబోను. ఒక్కో క్రీడాకారిణిపై ఒక్కో వ్యూహంతో ఆడాల్సి ఉంటుంది' అని సింధు తెలిపింది. నేడు మహిళల సింగిల్స్ గ్రూప్-ఏ మ్యాచ్‌లో జపాన్ షట్లర్ అకానె యమగూచితో పి.వి సింధు తలపడనుంది.