Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి వ్యాఖ్యలు
ముంబయి : 2019 ప్రపంచకప్ సెమీఫైనల్స్ పరాజయం తర్వాత ఎం.ఎస్ ధోని మళ్లీ మైదానంలో కనిపించలేదు. మైదానం లోపల అభిమానులు ధోని నామస్మరణ చేస్తుండగా, మైదానం వెలుపల విలేకరులు ధోని గురించి అడుగుతూనే ఉన్నారు. ఇటీవల స్వయంగా ధోని తన వీడ్కోలుపై ఓ మాట చెప్పాడు. ' జనవరి వరకు వీడ్కోలు గురించి ఎవరూ అడగొద్దు' అని పేర్కొన్నాడు. అయినా, మహేంద్రుడు మళ్లీ ఆడతాడా? చివరి ఇన్నింగ్స్ ఆడేశాడా? అంటూ ఊహాగానాలు చక్కర్లు కొడుతూనే ఉన్నాయి. భారత చీఫ్ కోచ్ రవిశాస్త్రి మరోసారి ధోని చర్చలో భాగమయ్యాడు. దిగ్గజ క్రికెట్ ధోని మళ్లీ ఆడతానంటే కచ్చితంగా ఆడనివ్వాలి.. అతడి నిర్ణయంపై వాదన వద్దు అనేశాడు. ' ఎం.ఎస్ ధోని దిగ్గజం. ధోని గురించి తెలిసిన వ్యక్తిగా చెబుతున్నాను. భారత క్రికెట్ జట్టుపై తనను తాను రుద్దాలని మహి భావించడు. ప్రస్తుతం ఆట నుంచి విరామం తీసుకోవాలని భావించాడు. 2020 ఐపీఎల్ సీజన్‌లో ధోని ఆడతాడు. ఐపీఎల్‌లో ఆడిన తర్వాత జాతీయ జట్టుకు ఆడగలను అని ధోని భావిస్తే, అతడి నిర్ణయంపై వాదన చేయాల్సిన అవసరం ఎవరికీ లేదు' అని రవిశాస్త్రి తెలిపాడు.