Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పోర్ట్స్ హెర్నియా గాయంతో బాధపడుతున్న పేసర్
ముంబయి : టీమ్ ఇండియా స్వింగ్‌స్టార్ భువనేశ్వర్ కుమార్ వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌కు దూరమయ్యాడు. చాన్నాండ్ల తర్వాత టీ20 జట్టులోకి వచ్చిన భువనేశ్వర్ కుమార్ కరీబియన్లపై పునరాగమనం చేశాడు. వెస్టిండీస్‌తో ముంబయిలో జరిగిన మూడో టీ20 తర్వాత భువనేశ్వర్ కుమార్ గాయంపై బీసీసీఐ వైద్య సిబ్బందికి తెలియజేశాడు. ముంబయిలో స్పెషలిస్ట్ వద్ద పరీక్షలు నిర్వహించిన అనంతరం భువనేశ్వర్ కుమార్ వన్డే సిరీస్ నుంచి దూరమైనట్టు బోర్డు ఓ ప్రకటన విడుదల చేసింది. ' ముంబయిలో వెస్టిండీస్‌తో చివరి టీ20 ముగిసిన తర్వాత భువనేశ్వర్ కుమార్ గజ్జల్లో నొప్పి గురించి ఫిర్యాదు చేశాడు. స్పెషలిస్ట్‌లు భువనేశ్వర్‌కు ఆల్ట్రాసౌండ్ పరీక్షలు నిర్వహించిన అనంతరం గజ్జల్లో (స్పోర్ట్స్ హెర్నియా) గాయం ధ్రువీకరించారు. వన్డే సిరీస్‌లో భువనేశ్వర్ ఆడటం లేదు. షార్దుల్ ఠాకూర్ వన్డే జట్టుతో చేరతాడు' అని బీసీసీఐ ప్రకటనలో తెలిపింది. 2019 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మాంచెస్టర్ మ్యాచ్‌లో 2.4 ఓవర్ల పాటు బౌలింగ్ చేసిన భువనేశ్వర్ కుమార్ గాయంతో మ్యాచ్ మధ్యలోనే పెవిలియన్‌కు చేరుకున్నాడు. ఆ గాయం నుంచి కోలుకుని ఇప్పుడే రీ ఎంట్రీ ఇచ్చిన భువనేశ్వర్ మళ్లీ గాయం బారిన పడ్డాడు. భువనేశ్వర్ కుమార్ గాయంపై సవివరణ షెడ్యూల్‌లో త్వరలోనే విడుదల చేస్తామని బీసీసీఐ తెలిపింది. వన్డే జట్టుకు ఎంపికైన షార్దుల్ ఠాకూర్ చివరగా ఆసియా కప్‌లో కనిపించాడు. దేశవాళీ సయ్యద్ ముస్తాక్ అలీ టీ20 టోర్నీలో ముంబయి తరఫున ఎనిమిది మ్యాచుల్లో 9 వికెట్లు పడగొట్టాడు. ఓపెనర్ శిఖర్ ధావన్ సైతం మోకాలి గాయంతో విండీస్ సిరీస్‌కు దూరం కాగా.. టీ20ల్లో సంజు శాంసన్, వన్డేల్లో మయాంక్ అగర్వాల్‌లను జట్టులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.