Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్, ఆసీస్ టెస్టులపై వార్న్
ముంబయి : ప్రపంచ క్రికెట్‌లో ఏ కోణంలో చూసినా, ఏ ఫార్మాట్‌లో ఆడినా సమవుజ్జీలు అనదగిన రెండు జట్లు భారత్, ఆస్ట్రేలియా. బలమైన బ్యాటింగ్ లైనప్, తిరుగులేని పేస్ దళం, నాణ్యమైన ఆల్‌రౌండర్లు, మాయచేసే స్పిన్నర్లు ఇరు జట్ల సొంతం. భారత్, ఆస్ట్రేలియా ఏ ఫార్మాట్‌లో తలపడినా అభిమానులకు పండుగే. అందుకు భారత్, ఆస్ట్రేలియాలు రాబోయే టెస్టు సిరీస్‌లో ఐదు టెస్టుల్లో తలపడాలని దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్ అభిప్రాయపడ్డాడు. భారత్, ఆస్ట్రేలియా టెస్టు సవాల్‌పై తన అభిప్రాయాన్ని ట్విటర్‌లో పంచుకున్నారు. ' నేను ఇదివరకే చెప్పాను. రాబోయే పర్యటనలో భారత్, ఆస్ట్రేలియా మధ్య ఐదు టెస్టులు జరగాలి. బ్రిస్బేన్, పెర్త్, ఆడిలైడ్, మెల్‌బోర్న్ (డేనైట్), సిడ్నీ వేదికగా ఐదు టెస్టుల్లో పోటీపడాలి. షెడ్యూల్‌ను సాకుగా చూపించవద్దు. బీసీసీఏ, క్రికెట్ ఆస్ట్రేలియా ఐదు టెస్టుల సిరీస్‌ను సుసాధ్యం చేస్తాయని ఆశిస్తున్నాను' అని షేన్ వార్న్ ట్వీట్ చేశారు. ఈ ఏడాది ఆస్ట్రేలియాలో పర్యటించనున్న భారత్ అక్కడ కంగారూ జట్టుతో నాలుగు టెస్టుల బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్‌లో తలపడనుంది. గత పర్యటనలో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని 2-1తో కోహ్లిసేన చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా, ఆస్ట్రేలియా పర్యటనలో గులాబీ బంతి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నామని కెప్టెన్ కోహ్లి అన్నాడు. వేదిక ఎక్కడైనా, ఫార్మాట్ ఏదైనా, బంతి ఏదైనా సవాల్ స్వీకరించేందుకు టీమ్ ఇండియా సిద్ధమని విరాట్ వ్యాఖ్యానించాడు.