Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఈ పరిస్థితి తప్పదు : గౌతం గంభీర్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ క్రికెట్ ప్రపంచాన్ని కాటువేసింది. అత్యంత ప్రమాదకారిగా పరిణమించిన కోవిడ్-19 మహమ్మారి అంతర్జాతీయ క్రికెట్ సహా ఐపీఎల్ నిరవధిక వాయిదాకు కారణం అయ్యింది. సమీప భవిష్యత్‌లో కరోనా వైరస్‌ను పూర్తిగా తుదముట్టించే పరిస్థితి కనిపించటం లేదు. అలాగని, పూర్తిగా ఆటకు సెలవు ప్రకటించలేరు. దీంతో కరోనా వైరస్‌తో క్రికెట్ సహజీవనం చేయాల్సిందేనని మాజీ క్రికెటర్, ఎంపీ గౌతం గంభీర్ వ్యాఖ్యానించాడు. ' కరోనా వైరస్ కారణంగా క్రికెట్‌లో సమూల మార్పులు వస్తాయని అనుకోవటం లేదు. బంతి మెరుపు కోసం వినియోగించే లాలాజలం, స్వేదానికి ప్రత్యామ్నాయాలు మాత్రం రావచ్చు. అంతకుమించి, క్రికెట్‌లో ఎటువంటి మార్పులు ఉండబోవు. ఆటగాళ్లు, అధికారులు అందరూ కరోనా వైరస్‌తో కలిసి జీవించటం నేర్చుకోవాలి. అక్కడ కరోనా వైరస్ ఉంది, ఉంటుంది అనే సృహతో మెలగాలి. కరోనా వైరస్‌తో సహజీవనం కాలంతో పాటు మెరుగవుతుంది!. భౌతిక దూరం పాటించటం క్రీడల్లో సులువుగా సాధ్యపడే విషయం కాదు. క్రికెట్‌లో దీన్ని కొంతవరకు అమలు చేయవచ్చు కానీ ఫుట్‌బాల్, హాకీల్లో ఎలా?. త్వరలోనే క్రీడలు ఈ విషయాన్ని అంగీకరిస్తాయి. కరోనాతో కలిసి జీవించడాన్ని ఆమోదిస్తాయి' అని గౌతం గంభీర్ అన్నాడు.