Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లండన్: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ అలెస్టర్ కుక్ ప్రశంసల జల్లు కురిపించాడు. అల్‌టైమ్ టాప్-5 గొప్ప ఆటగాళ్లలో విరాట్ కోహ్లీ ఒకడని ఆయన అన్నాడు. వెస్టిండీస్ మాజీ క్రికెటర్ బ్రియాన్ లారా గొప్ప ఆటగాడని, 131 టెస్టుల్లో 11,953 పరుగులు చేయడంతోపాటు ఓ ఇన్నింగ్స్‌లో 400 బాదిన ఏకైక ఆటగాడన్నాడు. 299 వన్డేల్లోనే 10,505 పరుగులు చేశాడని, మరైల్‌బోన్ క్రికెట్ క్లబ్(ఎంసిసి) మ్యాచ్‌లో లారా కొట్టిన శతకాన్ని తాను ఇప్పటికీ గుర్తుంచుకుంటానన్నాడు. ''2004లో జరిగిన మ్యాచ్‌లో తమవద్ద పటిష్టమైన బౌలర్లు.. సిమన్ జోన్స్, మ్యాథ్యూ హోగార్డ్, మిన్ పటేల్ ఉన్నారని, అలాంటి బౌలర్లపై బ్రియన్ లారా విధ్వంస బ్యాటింగ్ చేస్తూ.. లంచ్ బ్రేక్, టీ బ్రేక్ మధ్యలోనే సెంచరీ బాదడం విశేషమన్నాడు.
ఆ రోజు తాను లారా అనితర సాధ్యమైన బ్యాటింగ్ చూశానని'' కుక్ చెప్పుకొచ్చాడు. ఇక తన కాలం గొప్ప బ్యాట్స్‌మెన్లలో పాంటింగ్, కల్లిస్, సంగక్కర ఆ తర్వాతి వరుసలో ఉన్నారన్నాడు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ అత్యుత్తమ బ్యాట్స్‌మెన్ అని.. మూడు ఫార్మాట్లలో కోహ్లీ సులభంగా పరుగులు రాబట్టగలడని కుక్ పేర్కొన్నారు.