Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఫిఫా-17 మహిళల వరల్డ్‌కప్ షెడ్యూల్
న్యూఢిల్లీ : కరోనా వైరస్ మహమ్మారి కారణంగా వాయిదా వేయబడిన ఫిఫా ఏజ్ గ్రూప్ వరల్డ్‌కప్‌ల షెడ్యూల్ విడుదలైంది. ఈ ఏడాది నవంబర్‌లో భారత్ వేదికగా అమ్మాయిల అండర్-17 ఫిపా ప్రపంచకప్ జరగాల్సి ఉంది. కరోనా వైరస్ కారణంగా ఆట నిలిచిపోవటంతో ఫిఫా అండర్-17 మహిళల వరల్డ్‌కప్ వాయిదా పడింది. లోకల్ ఆర్గనైజింగ్ కమిటీ సోమవారం వరల్డ్‌కప్ షెడ్యూల్ విడుదల చేసింది. వచ్చే ఏడాది టోర్నీని నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఫిబ్రవరి 17-7 మార్చి 2021న ఫిఫా అండర్-17 వరల్డ్‌కప్ జరుగుతుంది. అవసరమైతే అప్పటి పరిస్థితులు, ప్రభుత్వ మార్గదర్శకాల అనుసారం మార్పులు ఉండే అవకాశం ఉందని కమిటీ తెలిపింది. అండర్-17 అమ్మాయిల వరల్డ్‌కప్ ఏడాది వాయిదా పడినా, వయో అర్హతలో ఎటువంటి మార్పులు చేయలేదు. జనవరి 1, 2003 నుంచి డిసెంబర్ 31, 2005న జన్మించిన అథ్లెట్లకే ఈ వరల్డ్‌కప్‌లో ఆడే అవకాశం ఉంటుంది. ఫిఫా అండర్-17 బార్సు వరల్డ్‌కప్‌కు ఘనంగా ఆతిథ్యం ఇచ్చిన భారత్, ఇక్కడ ఫుట్‌బాల్‌కు ఆదరణ తీసుకురావటంలో ఒకింత విజయం సాధించింది. ఇప్పుడు అమ్మాయిల వరల్డ్‌కప్‌తో ఆ జోష్‌ను మరింత ముందుకు తీసుకెళ్లాలని భావిస్తోంది.