Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-సీఈఓ పదవీ కాలంపై బీసీసీఐ నిర్ణయం
ముంబయి : భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) తొలి ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓ) రాహుల్ జోహ్రీ పదవీ కాలం మరో ఏడాది పెంపుతూ బీసీసీఐ నిర్ణయం తీసుకుందని సమాచారం!. భారత క్రికెట్ బోర్డు పరిపాలనలో ప్రొఫెషనలిజం కోసం జస్టిస్ ఆర్.ఎం లోధా కమిటీ బీసీసీఐలో సీఈఓ పదవికి సూచనలు చేసింది. 2016లో బీసీసీఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్, కార్యదర్శి అనురాగ్ ఠాకూర్‌ల సమయంలో రాహుల్ జోహ్రీని సీఈఓగా నియమించారు. లైంగిక వేధింపుల ఆరోపణలు 'మీటూ' సెగ రాహుల్‌కు తగిలింది. మాజీ సహచర ఉద్యోగి రాహుల్‌పై ఆరోపణలు చేసింది. పాలకుల కమిటీ చైర్మన్ వినోద్‌రారు అప్పట్లో దీనిపై విచారణ జరిపించారు. క్లీన్‌చిట్ లభించిన తర్వాత జోహ్రీ విధుల్లోకి చేరారు. జోహ్రీ సమయంలోనే (2017) స్టార్ ఇండియా గ్రూప్ ఐపీఎల్ మీడియా హక్కులను రికార్డు ధరకు సొంతం చేసుకుంది. ఎన్నికైన ఆఫీస్ బేరర్లు లేని సమయంలో బీసీసీఐకి అన్ని తానై వ్యవహరించిన జోహ్రీ ఈ ఏడాది జనవరిలో రాజీనామా సమర్పించారు. బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ రాజీనామాను తిరస్కరించారు. ఇప్పుడు కరోనా కష్టకాలంలో, ఐసీసీలో భారత్ లావాదేవీలపై మెరుగైన అవగాహన కలిగిన వ్యక్తిగా జోహ్రీ అనుభవం బోర్డుకు అవసరమని గంగూలీ భావించారు. దీంతో రాహుల్ జోహ్రీని సీఈఓగా మరో ఏడాది పాటు కొనసాగించాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.