Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లాహోర్: కరోనా వైరస్ నివారణలో భాగంగా చేయూతనివ్వడానికి బంగ్లాదేశ్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ బ్యాట్‌ను వేలానికి పెట్టాడు. ఆ బ్యాట్‌ను పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిది 20వేల అమెరికన్ డాలర్లకు సొంతం చేసుకున్నాడు. 2013లో శ్రీలంకపై టెస్టుల్లో డబుల్ సెంచరీ చేసిన ఈ బ్యాట్‌ను ముష్ఫికర్ వేలానికి పెట్టిన విషయం తెలిసిందే. 'అఫ్రిది తన ఫౌండేషన్ కోసం బ్యాట్‌ను కొనుగోలు చేసినందుకు తమకు మద్దతుగా నిలిచినందుకు థాంక్స్' అంటూ రహీమ్ ట్వీట్ చేశాడు.