Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ 2023 ఆతిథ్య హక్కులుదక్కేదెవరికో?
-జూన్ 25న వెల్లడి
న్యూయార్క్: ఫిఫా 2023 మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆతిథ్య హక్కులు దక్కేదెవరికో జూన్‌లో తేలనుంది. శనివారం ఇథియోపియాలోని అడిస్ అబాబాలో జరగాల్సిన ఫుట్‌బాల్ గవర్నింగ్ బాడీ కౌన్సిల్ సమావేశం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. జూన్ 25న జరిగే ఆన్‌లైన్ సమావేశంలో ఫిఫా ఫుట్‌బాల్ పాలకమండలి ఆతిథ్య హక్కుల ప్రకటన చేయనుంది. ఆతిథ్య హక్కులకు ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లనుండి సంయుక్త బిడ్‌లురాగా.. బ్రెజిల్, కొలంబియా మరియు జపాన్ విడిగా బిడ్‌లు దాఖలు చేశాయి. స్వీడన్, జర్మనీ, కెనడా మరియు ఫ్రాన్స్‌కూడా బిడ్‌లు దాఖలు చేసినా ఆతిథ్య హక్కులు దక్కే అవకాశం లేదు. 2023 ఆతిథ్య హక్కులకు బహిరంగ ఓటింగ్ ప్రక్రియలో అర్హతగల బిడ్లు ఫిఫా కౌన్సిల్‌కు సమర్పించబడతాయి, ఇందులో ప్రతి బ్యాలెట్ ఫలితం మరియు సభ్యుల సంబంధిత ఓట్లు ఫిఫా.కామ్‌లో కౌన్సిల్ తెలియజేస్తుందని ఫిఫా పేర్కొంది. 2023 ఫిఫా ప్రపంచకప్ టోర్నమెంట్‌లో 32జట్లు ప్రాతినిధ్యం వహించడం ఇదే తొలిసారి. మహిళల ఫుట్‌బాల్ ప్రపంచకప్ 1991 ప్రారంభం కాగా.. చైనా, అమెరికా రెండేసిసార్లు ఆతిథ్యమిచ్చాయి. అమెరికా 2019 టైటిల్‌ను గెల్చుకోవడంతోపాటు అత్యధికంగా నాలుగుసార్లు ట్రోఫీని ముద్దాడింది.