Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కోల్‌కతా: ఇండియన్ ప్రిమియర్ లీగ్(ఐపిఎల్) 13వ సీజన్‌ను రెండే నగరాల్లో నిర్వహిస్తే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉండదని కోల్‌కతా నైట్‌రైడర్స్(కెకెఆర్) సిఇవో వెంకీ మైసూర్ సలహా ఇచ్చారు. దేశంలో లాక్‌డౌన్ విధించక ముందు మార్చి నెలలో జరిగిన ఐపిఎల్ సమా వేశంలోనూ దీనిపై చర్చ జరిగినట్లు తెలుస్తోందని చెప్పుకొ చ్చారు. అయితే ఐపిఎల్ మొత్తం సీజన్ నిర్వహించగలిగే అవకాశం పుణే, ముంబయికి మాత్రమే ఉందని నిపుణులు తెలిపారు. ముంబయిలో రిలయన్స్ స్టేడియంతో కలిపి నాలుగు మైదానాలు ఉన్నాయి. అక్కడి నుంచి రెండున్నర గంటల దూరంలోనే పుణే ఉంది. కాబట్టి ఐపిఎల్ నిర్వహిం చడానికి ఈ రెండు నగరాలు సరైనవని వెంకీ చెప్పుకొ చ్చారు. ఆటగాళ్లని అన్ని జాగ్రత్తల తో స్టేడియంలకు తరలించాలని, ఒక జట్టుకోసం ఒక హోటల్‌ని కేటాయిస్తే తద్వారా భౌతిక దూరం పాటించడం సులభమవు తుంద న్నారు. ఇక ప్రయాణాల కోసం ఒకటి కాకుండా రెండు బస్సులు పెట్టి.. అందులో శానిటైజర్లు, మాస్కులు వంటి తగిన జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బంది ఉండదన్నారు.