Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-క్రీడలపై తొలుగుతున్న కరోనా మేఘాలు
- 65 రోజుల తర్వాత జర్మనీలో మొదలైన ఫుట్‌బాల్ ఆట
- ప్రేక్షకుల్లేకుండానే బుండెస్‌లిగా టోర్నీ
- 2023 జూన్ 25న ఫుట్‌బాల్ వరల్డ్ గవర్నింగ్‌బాడీ భేటీ
- మహిళాఫుట్‌బాల్ ప్రపంచకప్ ఆతిథ్యదేశం ఎంపిక
బెర్లిన్ : కరోనా... లాక్‌డౌన్‌లనుంచి నెమ్మదిగా ద్వారాలు తెరుచుకుంటున్నాయి. జనం తమ పనుల్లోకి బిజి అవుతుంటే.. మరోవైపు బోసిపోయిన స్టేడియంలలో క్రీడలు మొదలవుతున్నాయి. కరోనా కారణంగా ఎనిమిదివేల మందికి పైగా ఆ దేశంలో చనిపోయారు. ఇది నాణేనికి ఓవైపు..మరోవైపు ఫుట్‌బాల్ మ్యాచులు ఆరంభమయ్యాయి. తాజాగా జర్మనీలో 65 రోజుల తర్వాత ఫుట్‌బాల్ క్రీడ మళ్లీ షురూ అయ్యింది. సుమారు రెండు నెలల విరామం తర్వాత యూరప్‌లో తిరిగి ఫుట్‌బాల్ ఆట మొదలైంది. కరోనా విజంభణతో జర్మనీలో ఆగిపోయిన బుండెస్‌లిగా 2019-2020 సీజన్ శనివారం షురూ అయ్యింది. దీంతో యూరప్‌లో ఆరంభమైన తొలి మేజర్ టోర్నీగా బుండెస్‌లిగా నిలిచింది. కరోనా పూర్తిగా అదుపులోకి రాకపోవడంతో సీజన్‌లో మిగిలిన మ్యాచ్‌లను ప్రేక్షకులు లేకుండానే నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. అంతేకాకుండా ఆటగాళ్లను, సిబ్బందిని ఎప్పటికప్పుడు పరీక్షిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటామని జర్మనీ ఫుట్‌బాల్‌లీగ్ ప్రభుత్వానికి తెలిపింది.
వాస్తవంగా టాప్‌లీగ్ బుండెస్‌లి టోర్ని మార్చి 11 నుంచి నిలిచిపోయింది. జర్మనీ సర్కార్ అనుమతించటంతో..శనివారం మళ్లీ ఫుట్‌బాల్ ఆట మొదలైంది. మ్యాచ్ జరుగుతున్నపుడు పలుదఫాలుగా బంతిని శానిటైజ్ చేశారు. క్రీడాభిమానులను మాత్రం స్టేడియంలోకి అనుమతించలేదు. బోరిసియా డార్ట్‌మండ్ 4..0 తేడాతో శుల్కేను ఓడించింది. ఇది 16వ విజయం కావటం గమనార్హం. మ్యాచ్‌లో డార్ట్‌మండ్ తరఫున గుఈరిరో రెండు గోల్స్ చేశాడు. హాలెండ్,హజాయి చేరో గోల్ చేశారు. పతకాల పట్టికలో 54 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నది. బయార్న్ మ్యూనిక్ 55 పాయింట్లతో ప్రథమస్థానంలో ఉన్నది.
25న వరల్డ్ కప్ ఆతిథ్యదేశం ఎంపిక..
ఫుట్‌బాల్ వరల్డ్ గవర్నింగ్ బాడీ ఫీఫా 2023 జూన్ 25న మహిళా వరల్డ్‌కప్ ఫుట్‌బాల్ టీమ్ ఆతిథ్యదేశాన్ని ఎంపిక చేయనున్నది. ఆన్‌లైన్ సమావేశాలతో ఫీఫా ఆతిథ్యదేశాన్ని ఎంపికచేయనున్నది. ఆస్ట్రేలియా,న్యూజిలాండ్ దేశాలు తమకు అవకాశం ఇవ్వాలని సంయుక్తంగా ప్రతిపాదించాయి. అయితే బ్రెజిల్,కొలంబియా,జపాన్ దేశాలు కూడా ఈ రేస్‌లో ఉన్నాయి.
వరల్డ్‌కప్‌లో 32 జట్లు
ఈ ఏడాది బిడ్డింగ్ ప్రాసెస్ మహిళా వరల్డ్ కప్ చరిత్ర సృష్టించనున్నది. ఎందుకంటే ఎక్కువ దేశాలు భాగస్వామ్యం కానున్నాయి. మహిళా ఫుట్‌బాల్ పోటీల నిర్వహణకు 7588 కోట్లు (ఒక బిలియన్ డాలర్లు) ఖర్చుచేయనున్నది. 2023లో జరగనున్న వరల్డ్ కప్‌లో 32 టీములు పాల్గొనున్నాయి. ఇలా మొదటిసారి మహిళా వరల్డ్ కప్‌లో 32 టీములు భాగస్వామం కావటమని ఫీఫా అంటున్నది.