Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- లాక్‌డౌన్‌లో సరదా వీడియో..
ముంబయి : లాక్‌డౌన్‌తో దేశంలో ఓ వైపు వలసకూలీలు సొంతూర్లకు వెళ్లటానికి నానా కష్టాలు పడుతుంటే..మరోవైపు సెలబ్రెటీలు మాత్రం వీడియోలు తీసిపోస్ట్ చేస్తు న్నారు. తాజాగా టీమిండియా సారథి విరాట్ కోహ్లి డైనోసర్‌గా మారాడు. కరోనా లాక్‌డౌన్ కారణంగా అన్ని టోర్నీలు రద్దయ్యాయి. పర్యటనలూ వాయిదాపడ్డాయి. దీంతో భారత ఆటగాళ్లంతా ఇంటికే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో లాక్‌డౌన్ రూపంలో ఊహించని విరామాన్ని కోహ్లి తన సతీమణి, బాలీవుడ్ నటి అనుష్క శర్మతో కలిసి బాగా ఎంజారు చేస్తున్నాడు. తమకు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌మీడియాలో అభిమానులతో పంచుకుంటున్నారు విరుష్కలు. తాజాగా అనుష్క తన ఇన్‌స్టాలో షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతున్నది.