Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్స్ చీఫ్ థామస్ బాచ్
టోక్యో : ఒలింపిక్స్‌ను తరచుగా వాయిదా వేయడం కుదరదనీ, 2021 విండోనే చివరి అవకాశమనీ.. రీషెడ్యూల్ ప్రకారం సాగకపోతే రద్దు చేస్తామని ఒలింపిక్స్ చీఫ్ థామస్ బాచ్ అన్నారు. గురువారం ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ.. కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్ మార్చిలోనే వచ్చే ఏడాదికి వాయిదాపడ్డాయనీ, పరిస్థితులన్నీ చక్కబడితే 2021 జులై 23 నుంచి విశ్వక్రీడలను జరుపుతామన్నారు. విశ్వక్రీడలకు ఆతిథ్యమిస్తోన్న జపాన్ తరఫు నుంచి కూడా ఆలోచిస్తున్నామనీ, ఇలా వాయిదాలు వేసుకుంటూపోతే అన్ని రోజులూ జపాన్ ప్రభుత్వం సుమారు మూడు నుంచి ఐదువేల మందివరకు సిబ్బంది జీతభత్యాలు భరించడం కష్టమన్నారు. 2020 ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా వేయడంతో జపాన్ ఆర్థికంగా బాగా నష్టపోయిందనీ, పరిస్థితి ఇలాగే ఉంటే క్రీడాకారుల ఫిట్‌నెస్‌పై కూడా ప్రభావం పడే అవకాశముందన్నారు.