Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీసీసీఐను కోరిన దక్షిణాఫ్రికా క్రికెట్‌బోర్డు
జోహాన్స్‌బర్గ్ : మూడు టీ20ల సిరీస్ కోసం దక్షిణాఫ్రికా పర్యటనకు భారత క్రికెట్ జట్టు రావాలని ఆ దేశ క్రికెట్ బోర్డు కోరింది. ఈ విషయాన్ని క్రికెట్ సఫారీ తాత్కాలిక సీఈఓ జాక్వెస్ ఫౌల్ గురువారం వెల్లడించారు. ఈ పర్యటనపై బీసీసీఐతో చర్చలు జరుగుతున్నా యనీ, త్వరలోనే దీనిపై తుది నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. లాక్‌డౌన్‌కుముందు టీమిండియాతో దక్షిణాఫ్రికాజట్టు మూడువన్డే సిరీస్ ఆడాల్సి ఉండగా.. తొలి మ్యాచ్ వర్షం కారణంగా రద్దు అయ్యింది. ఆ తర్వాత రెండు వన్డేలు కరోనా వ్యాప్తి కారణంగా రద్దు చేశారు. అయితే ఈ సిరీస్‌ను మళ్లీ నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే దక్షిణాఫ్రికాతో టి20 సిరీస్‌పై బీసీసీఐ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.