Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ప్రత్యేక విమానంలో మాంచెస్టర్‌లో అడుగు
-అక్కడే 14 రోజుల స్వీయ క్వారంటైన్
మాంచెస్టర్ (ఇంగ్లాండ్)
కరోనా మహమ్మారి వేళ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) ఆదాయం కాపాడుకునేందుకు అన్ని శక్తులూ ఒడ్డుతోంది. పరిస్థితి భయం భయంగా ఉన్నప్పటికీ వరుసగా రెండో విదేశీ జట్టు ఇంగ్లాండ్‌లో కాలుమోపేలా చేసింది. ప్రత్యేక విమానం, బస, ఇతర ఖర్చులు సహా రూ. 23 కోట్లు వెస్టిండీస్ క్రికెట్ బోర్డుకు సాయం చేసిన ఇంగ్లాండ్.. మాంచెస్టర్‌లో జులై 8 నుంచి టెస్టు సిరీస్‌కు శ్రీకారం చుట్టబోతోంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ జట్టు సైతం ఇంగ్లాండ్‌కు చేరుకుంది. సుమారు రూ. 5 కోట్లతో ప్రత్యేక విమానం ఏర్పాటు చేసిన ఇంగ్లాండ్.. మాంచెస్టర్‌లోనే పాకిస్థాన్ జట్టుకు బస ఏర్పాటు చేసింది. పాక్ జట్టు కోసం పూర్తిగా ఓ హౌటల్‌ను బుక్ చేసింది.
జులై 13 నుంచి షురూ! : వెస్టిండీస్ క్రికెట్ జట్టు సాఫీగానే ఇంగ్లాండ్‌కు చేరుకున్నా.. పాకిస్థాన్ క్రికెట్ జట్టులో కరోనా కలకలం రేగింది. 10 మంది ఆటగాళ్లు, ఒక సహాయక సిబ్బంది కోవిడ్-19 పాజటివ్‌గా తేలిన సంగతి తెలిసిందే. దీంతో ఇంగ్లాండ్ పర్యటనపై సందిగ్థత కొనసాగింది. కోవిడ్-19 పాజిటివ్ వచ్చిన క్రికెటర్లను రావల్పిండిలోనే వదిలేసిన పీసీబీ.. మిగతా 20 మంది క్రికెటర్లు, 11 మంది సహాయక సిబ్బందితో మాంచెస్టర్ విమానానికి పచ్చజెండా ఊపింది. కోవిడ్-19 నెగెటివ్ అని నిర్ధారణ అయిన తర్వాత మిగతా ఆటగాళ్లను బిజినెస్ క్లాస్ విమానాల్లో మాంచెస్టర్‌కు పంపించనుంది. బయో బబుల్ వాతావరణంలో ఇంగ్లాండ్, పాకిస్థాన్‌లు మూడు టెస్టులు, మూడు టీ20లు ఆడాల్సి ఉంది. ' పాకిస్థాన్ మరో చారిత్రక పర్యటన కోసం ఇంగ్లాండ్‌కు వెళ్తోంది. ఇంగ్లాండ్‌లో ఆడటం ఎప్పుడూ ఉత్సాహభరి తమే. అభిమానులారా.. ఎప్పుడూ మీ మద్దతు, అభిమానం, ప్రార్థనలు మాకు అవసరమే' వన్డే,టీ20 కెప్టెన్ బాబర్ ఆజామ్ ట్వీటర్‌లో పేర్కొన్నాడు. ఇంగ్లాండ్ పర్యటన నిమిత్తం తొలుత పీసీబీ 29 మందితో కూడిన జట్టును ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. పీసీబీ టెస్టులో పాజిటివ్‌గా తేలిన మహ్మద్ హఫీజ్.. ప్రయివేటు పరీక్షల్లో నెగెటివ్‌గా నిర్ధారించుకున్నాడు. అయినా, హఫీజ్‌కు పీసీబీ గ్రీన్ సిగల్ ఇవ్వలేదు.
ఇంగ్లాండ్ పర్యటనకు పాకిస్థాన్ జట్టు : అజార్ అలీ (కెప్టెన్), బాబర్ ఆజామ్ (వైస్ కెప్టెన్), అబిడ్ అలీ, అసద్ సఫీక్, ఫహీమ్ ఆష్రఫ్, ఫవాద్ ఆలాం, ఇఫ్తీకార్ అహ్మద్, ఇమద్ వసీం, ఇమామ్ ఉల్ హాక్, ఖుషిద్ షా, మహ్మద్ అబ్బాస్, ముసా ఖాన్, నసీమ్ షా, రోహైల్ నజీర్, సర్ఫరాజ్ అహ్మద్, షాహీన్ ఆఫ్రిది, షాన్ మసూద్, సోహైల్ ఖాన్, ఉస్మాన్ షిన్వారి, యాసిర్ షా.