Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఆర్ఎస్ కువైట్ అధ్యక్షులు అభిలాష
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణలో 60 ఏండ్లలో జరగని అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఆరేండ్లలో చేసి చూపెట్టారని టీఆర్‌ఎస్ ఎన్‌ఆర్‌ఐ కువైట్ అధ్యక్షులు గొడిశాల అభిలాష కొనియాడారు. ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ యాసకు వన్నె తెచ్చి, కన్నీరు తప్ప నీరు తెలియని ఈ నేలపై జలసిరులు కురిపించారని ప్రశంసించారు. మెట్రో, ఫ్లై ఓవర్లు, కేబుల్ బ్రిడ్జిలను ఏర్పాటు చేయించారని తెలిపారు. తాగునీటి ఇబ్బందులు, కరెంటు కోతలు లేవనీ, మత కల్లోలాలు అస్సలేవని తెలిపారు. ఇంటర్నేషనల్ కంపెనీలు రావడంతో వేలాది మందికి ఉపాధి దొరికిందని పేర్కొన్నారు. అభివృద్ధి మున్ముందు జరగాలన్న, హైదరాబాద్ దేశంలోనే ఆదర్శంగా నిలవాలన్నా కేసీఆర్ నాయకత్వాన్ని బలపరిచాలని గ్రేటర్ ప్రజలను కోరారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థులను గెలిపించాలని విన్నవించారు.