Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఢిల్లీలో రైతుల పోరాటానికి సీపీఐ(ఎం) మద్దతు: రాష్ట్ర కమిటీ సభ్యులు జయలక్ష్మి
నవతెలంగాణ-మెదక్
కేంద్రంలోని మోడీ సర్కార్ రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందనీ, వ్యవసాయ వ్యతిరేక బిల్లులకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులందరికీ సీపీఐ(ఎం) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆపార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు పి.జయలక్ష్మి అన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలోని కేవల్ కిషన్ భవన్‌లో జరుగుతున్న రాజకీయ శిక్షణా తరగతులకు సోమవారం ఆమె హాజరై మాట్లాడారు. నాలుగు రోజులుగా పంజాబ్, ఉత్తరప్రదేశ్, హర్యానా, ఉత్తరా ఖండ్, రాజస్థాన్ రాష్ట్రాల రైతులు వ్యవసాయానికి వ్యతిరేకమైన మూడు బిల్లులను రద్దు చేయాలని ఢిల్లీకి తరలివెళ్తుండగా వారిపై కేంద్ర ప్రభుత్వం అడుగడుగునా ఆటంకాలు సృష్టించడం అన్యాయమన్నారు. రైతుల పై పోలీసులు నీటి ఫిరంగులతో దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం కార్పొరేట్లకు మేలు చేసే నిర్ణయాలు చేస్తోందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) మెదక్ జిల్లా కార్యదర్శి ఏ. మల్లేశం, జిల్లా నాయకులు కె.నర్సమ్మ, ఏ. మహేం దర్, బాలమణి, నాగరాజు, బస్వరాజ్, సంతోశ్, సత్తయ్య పాల్గొన్నారు.