Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న ఫ్రస్టేషన్‌లో తప్పుడు వార్తల ప్రచారం
- ప్రజలెవరూ నమ్మవద్దు : రాష్ట్ర ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌రావు
నవతెలంగాణ-పటాన్‌చెరు
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతుందన్న అసహనంతో నాయకు ల్లో రోజురోజుకి ఫ్రస్టేషన్ పెరిగిపోతోం దని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సంగా రెడ్డి జిల్లా పటాన్‌చెరు ఎమ్మెల్యే
గూడెం మహిపాల్ రెడ్డి నివాసంలో ఆయనతో కలిసి మంత్రి విలేక రుల సమావేశంలో మాట్లాడారు. సోమవారం పోలీస్ కమిషనర్ ఆఫీస్ ముందు బీజేపీ నాయకులధర్నా ఒక డ్రామాగా ఆయన అభివర్ణిం చారు. ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్‌షాతో సహా ఢిల్లీ నేతలను తెచ్చి ప్రచారం చేయించినా ఫలితం లేకపోవడంతో వారిలో అసహనం పెరిగిపోతోందన్నారు. బీజేపీ నేతలను ప్రజలు నమ్మకపోవడంతో సోషల్ మీడియా ద్వారా ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ లబ్ది పొందాలని చూస్తున్నారని ఆరోపించారు. ఫేక్ వార్తల ప్రచారంలో నోబెల్ బహుమతి ఉంటే అది బీజేపీకే వస్తుందని తెలిపారు. దుబ్బాక ఉప ఎన్నికల్లో సైతం ఎన్నికల రోజున ప్రముఖ టీవీ ఛానల్ లోగో వాడుకుని ఫేక్ ప్రచారం చేసి లబ్ది పొందారని గుర్తుచేశారు. అదే పద్ధతిలో జీహెచ్‌ఎంసీ ఎన్నికల రోజు సైతం టీఆర్‌ఎస్ ప్రముఖ నేతలు బీజేపీలో చేరుతారని ప్రచారం చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తమకు విశ్వసనీ య సమాచారం ఉందని తెలిపారు. తనతో సహా ఇతర ముఖ్య నేతల పై తప్పుడు వార్తలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసేందుకు ప్రయ త్నిస్తారనీ, దయచేసి ప్రజలెవరూ అలాంటి తప్పుడు వార్తలను నమ్మొద్దని సూచించారు. సోషల్ మీడియాను పూర్తి స్థాయి ఫేక్ మీడి యాగా బీజేపీ మార్చివేసిందని ఆరోపించారు. టీఆర్‌ఎస్ కార్యకర్తలె వరూ సంయమనం కోల్పోవద్దని సూచించారు. సమావేశంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, మాజీ ఎమ్మెల్యేలు కుర్ర సత్యనారాయణ, చింత ప్రభాకర్ పాల్గొన్నారు.