Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
కళతప్పిన సంక్రాంతి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

కళతప్పిన సంక్రాంతి

- డూడూ బసవన్నలపైనా కరోనా దెబ్బ
- గంగిరెద్దులోళ్ల బతుకులు ఆగం
- పూటగడవక ఇబ్బందులు..సొంతిళ్లు లేక తిప్పలు
- కళాకారుల గుర్తింపులోనూ వివక్షే
                 రథం ముగ్గులు... రేగుపండ్లు, పిండికొమ్మలతో గొబ్బెమ్మలు పెట్టినా సంక్రాంతికి నిండుశోభ తెచ్చిపెట్టేది గంగిరెద్దులాటే. 'అయ్యగారికి దండంపెట్టు...అమ్మగారికి దండం పెట్టు...ఇంటిల్లిపాదిని దీవించు' అనే గంగిరెద్దులోళ్ల సందడి అంతా ఇంతా కాదు. పీక ఊదుతూ..డోలి కొడుతూ ఉంటే డూ..డూ..బసవన్నల సయ్యాటలు...గంగిరెద్దులోళ్ల విన్యాసాలను చూస్తుంటే ఆహా! అనిపించక మానదు. వాటి విన్యాసాలను కండ్లప్పగించి చూడాల్సిందే. పేరుపేరునా తలుస్తుంటే ఔరా! అనాల్సిందే. నిక్కచ్చిగా చెప్పాలంటే సంక్రాంతి పండుగకు నిండు శోభ తెచ్చేది పతంగుల ఆట, గంగిరెద్దులోళ్ల ఆటాపాటే. కానీ, ఈ సారి ఆ 'కళ' తప్పింది. గంగిరెద్దుల హడావిడే కనిపించట్లేదు. గంగిరెద్దులోళ్లపైనా కరోనా ప్రభావం పడింది. పండుగ పూట పస్తులుండాల్సిన దుస్థితి వారిండ్లలో నెలకొంది. సంక్రాంతి పండగ నేపథ్యంలో గంగిరెద్దులోళ్ల జీవన స్థితిగతులపై నవతెలంగాణ ప్రత్యేక కథనం..
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
రాష్ట్ర ప్రభుత్వ లెక్కల ప్రకారం తెలంగాణలో 40 నుంచి 50 వేల దాకా గంగిరెద్దులవాళ్లు ఉన్నారు. కానీ, తమ వాళ్లు రాష్ట్ర వ్యాప్తంగా 70 వేల దాకా ఉంటారని గంగి రెద్దుల సంఘం ప్రతినిధులు చెబుతున్నారు. ప్రధానంగా నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, కరీంనగర్‌, వరం గల్‌, సిద్ధిపేట, హైదరాబాద్‌లో ఎక్కువగా ఉన్నారు. అయితే వీరు సంఘటితంగా ఎక్కడా లేరు. జిల్లాకో వెయ్యి, రెండు వేల కుటుంబాలు అదీ గ్రామాల్లో విసిరేసినట్టుగా ఉన్నాయి. దసరా, సంక్రాంతి పండగల సందర్భాలలో ఊర్లను వాటా లుగా పంచుకుని ఇంటింటికీ వెళ్తూ తమ గంగిరెద్దులను ఆడించి ప్రజలు ఇచ్చినంత తీసుకుని దీవనార్థాలు ఇస్తారు. ప్రతి ఇంటి యజమాని, వారి పూర్వీకుల పేర్లను గుర్తుకు పెట్టుకుని మరీ వారి పేర్లను తల్చుకుంటూ, కీర్తిస్తూ గంగిరెద్దులను ఆడించటం వీరి అద్భుత జ్ఞాపకశక్తికి నిదర్శనం. గ్రామంలో ఎవరైనా చనిపోతే తెలుసుకుని మరీ దినాల రోజు ఐదుగురు నుంచి పది మంది వరకు ఆటోను కిరాయికి మాట్లాడుకుని వారి ఇండ్ల ముందు వాలుతారు. దశ దినకర్మకు గంగిరెద్దులతో తమ కళను ప్రదర్శిస్తారు. చనిపోయిన వ్యక్తి కుటుంబం ఇచ్చే ఎంతో కొంత డబ్బును తీసుకుని ఇంత అన్నం తిని వెళ్లిపోతారు. ఇలా పని దొరికేది కొన్ని రోజులే. పండగ దినాలు, చావులు పోనూ మిగతా పనిదినాల్లో కూలినాలి దొరికితేనే కడుపు నిండేది. రానురాను కళకు ఆదరణ తగ్గటంతో ఇల్లు గడవక ఆడవాళ్లు గంపల వ్యాపారం(హరేక్‌ మాల్‌ సామానును తీసుకుని ఊర్లల్లో అమ్మటం) చేస్తున్నారు.
కళపై కరోనా దెబ్బ
కరోనా వచ్చాక వీరి బతుకులు దుర్భరంగా మారాయి. సమాజంలో ఎవ్వరూ దగ్గరకు రానివ్వని పరిస్థితి నెలకొంది. ఇండ్లను తిరిగి రావడం వల్ల కరోనా వస్తుందని చాలా కాలనీల్లోకి గంగిరెద్దుల వాళ్లను రానివ్వట్లేదు. కల్వకుర్తి దగ్గర ఓ ఊర్లో వాళ్లు మా ఊరి చివర ఉండొద్దంటూ తరిమిగొట్టారు. కరోనా నేపథ్యంలో ప్రభుత్వ ఆంక్షలతో చావులకు కొంత మందే రావాలనే నిబంధన పెట్టారు. దీంతో గంగిరెద్దుల వాళ్లను అక్కడకు అస్సలు రానివ్వట్లేదు. దీంతో వారు తమ ఉపాధిని కోల్పోయారు. కరోనా దెబ్బతో ఈ సంక్రాంతికి గంగిరెద్దుల హడావిడి అంతగా లేదు.
చదువుకున్నోళ్లు అంతంతే..రాజకీయ చైతన్యమూ తక్కువే
గంగిరెద్దుల సామాజిక తరగతిలో సర్కారు కొలువులున్నవారిని భూతద్ధంలో వెతికి చూడాల్సిన దుస్థితి. మొత్తంగా చూస్తే ఇద్దరు టీచర్లు, ఓ కానిస్టేబుల్‌, ఓ కండక్టర్‌, ఓ డ్రైవర్‌ మాత్రమే ఉన్న పరిస్థితి. ఇటీవల అనారోగ్యంతో కానిస్టేబుల్‌ కూడా చనిపోయాడు. పదోతరగతి దాటి చదివినోళ్ల సంఖ్య రెండువేల లోపే. డిగ్రీ దాటినోళ్లుఐదొందలలోపే. గంగిరెద్దులను ఆడించుకుంటూ ఒక్కకాడ ఉండకుండా ఊర్లు తిరుగుతుండటంతో ఆ సామాజిక తరగతిలో చదువుకున్న సంఖ్య చాలా తక్కువగా ఉంది. దీంతో ఆర్థికంగానూ, సామాజికంగా, రాజకీయంగానూ తీవ్ర వెనుకబాటులో ఉంది. రాష్ట్రంలో ఒక్క సర్పంచ్‌గానీ, ఎమ్‌పీటీసీగానీ లేకపోవడం గమనార్హం. మొత్తం మీద తెలంగాణలో గంగిరెద్దుల సామాజిక తరగతికి చెందిన ఆరుగురు వార్డుమెంబర్లు ఉన్నారు. రాజకీయంగా అత్యున్నత స్థాయిలో ఉన్నవాళ్లు వాళ్లే అంటేనే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
సొంతగూడూ కరువే..పథకాలు అందితే ఒట్టు!
పక్షులు పొద్దస్తమానం ఎక్కడెక్కడో తిరిగి సొంతగూటికి చేరుతాయి. వాటికైనా సొంత గూడుంది. కానీ, పొట్టతిప్పల కోసం కళాప్రదర్శనలు ఇచ్చి అలసిసొలసిన గంగిరెద్దులోల్లకు నిలువు నీడా లేదు. వారికంటూ ఓ సొంత గూడు లేదు. తరాలుగా ఇదే పరిస్థితి. రేషన్‌కార్డులు కూడా లేవు. దీంతో పథకాలకు దూరం అవుతున్నారు. సొంతిళ్లను కట్టిస్తామని గతంలో మంత్రి ఈటల రాజేందర్‌ హామీనిచ్చినా పట్టాలెక్కలేదు.ఆ సామాజిక తరగతిలోని మహిళలకు ఒక్కో గంపకు లక్ష రూపాయల చొప్పున సబ్సిడీ రుణాలు అందజేస్తామని హామీ నేటికీ నెరవేరలేదు.
సాహోపేత కళ.. పట్టుతప్పితే అంతే
ఒక్కో గంగిరెద్దుకు లక్ష, లక్షన్నర పెట్టి కొనాలి. ఆ తర్వాత ఆ ఎద్దుకు ఆట నేర్పాలి. ఆ తర్వాత వాటిని ఆడించడమూ నిజంగా ఓ కళే. పట్టుతప్పితే ప్రాణాలు కోల్పోవాల్సిందే. దండం పెట్టుడు. పొగుడుతూ తల ఊపించడం వరకు ఓకే. కబడ్డీ ఆటను ప్రాణాలను అడ్డుపెట్టి మరీ ఆడించాల్సిందే. ఒక్కోసారి గంగిరెద్దు ఎక్కువ ఆవేశానికి లోనైతే ఆపడం ఎవరితరమూ కాదు. మేడ్చల్‌ జిల్లాలో ఇలాగే ఓ గంగిరెద్దులాయన చనిపోయాడు. నాలుగైదేండ్లలో పదిమంది దాకా తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ భాషా, సాంస్కృతిక మండలి గంగిరెద్దుల కళాకారులను గుర్తించడంలో వెనుకబడింది.

సొంతిళ్లు కట్టివ్వాలి.. చదువులు చెప్పించాలి
సొంతిళ్లే లేనప్పుడు ఆత్మగౌరవ భవనాలెందుకు? ప్రతి కళాకారునికీ సొంత ఇల్లు కట్టి ఇవ్వాలి. గంగిరెద్దుల కళను, కళాకారులను సర్కారు గుర్తించాలి. సంక్రాంతి పండుగ రోజు శిల్పారామంలో ఓ పదిమంది గంగిరెద్దులోళ్లను తీసుకెళ్లి ఆటలాడించడం వల్ల మా బతుకులు మారవు. చదువు దరిచేరకపోవటంతో వెనుకబాటు తనం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. ఎంట్రెన్స్‌ పరీక్షల్లేకుండా మా పిల్లలకు గురుకుల పాఠశాలల్లో అడ్మిషన్లు ఇవ్వాలి. కుల ధ్రువీకరణ పత్రాల విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. దీన్ని సర్కారు పరిష్కరించాలి.
- రామస్వామి, గంగిరెద్దుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి
కేపీహెచ్‌బీలో దారుణం
118తో నూరు కష్టాలు
టెస్కాబ్‌ పనితీరు ప్రశంసనీయం
ఫైనలియర్‌ విద్యార్థులకే తరగతులు
కాసింపూర్‌లో కుల బహిష్కరణ
గీత సొసైటీలకు ఇచ్చిన భూములకు పట్టాలివ్వాలి: కేజీకేఎస్‌
వ్యూహాలు.. బుజ్జగింపులు...
రాష్ట్రంలో మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ జేఏసీ
బీసీడబ్ల్యూయూ డైరీ ఆవిష్కరణ
యూజర్‌ చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోండి
స్వయం ఉపాధి రుణాల యూనిట్లను పెంచాలి
బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయ అభ్యర్థులు రోడ్లపైనా?
విజయడెయిరీ రైతులకు ప్రోత్సాహక బకాయిలివ్వండి
విద్యుత్‌ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం: మంత్రి కేటీఆర్‌
ఎన్టీఆర్‌ కు చంద్రబాబునాయుడు నివాళి
పీఆర్‌ ఇంజినీరింగ్‌లో ప్రమోషన్ల గొడవ
పథకాల చేరవేతలో అంగన్‌వాడీల పాత్ర కీలకం :మంత్రి సత్యవతి
ఎస్సీ, ఎస్టీలు ఔత్సాహికవేత్తలుగా మారాలి
'జీహెచ్‌ఎమ్‌సీ చట్ట సవరణలపై పిల్‌ ఇప్పుడా...?'
రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలి
దోషులకు శిక్షలు పడాలి
స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత
అప్పుల ఊబిలో డిస్కంలు
రైతులతో పెట్టుకున్నోడు ఎవ్వడూ బాగుపడలేదు... : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
సీపీఎస్‌ను రద్దు చేయండి

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.