Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
గోస పట్టేనా? | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

గోస పట్టేనా?

- 20 ఏండ్లుగా పని చేస్తున్నా పెరగని వేతనాలు
- పీజీలు, డిప్లొమాలు, టీటీసీలు, డిగ్రీ అర్హతతో కొలువులు
- జీతం నాలుగు వేలు దాటని వైనం
- మంత్రులు, ప్రజా పతినిధులకు వినతుల మీద వినతులు
- ఆశగా బాల కేంద్రాల ఉద్యోగులు, సిబ్బంది ఎదురుచూపులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
'రాష్ట్రంలోని అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగులకు వేతనాలను, ఉద్యోగ విరమణ వయస్సును పెంచుతాం. అన్ని శాఖల్లోనూ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రారంభిస్తాం. ప్రభుత్వ, గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌, వర్క్‌ చార్జ్‌డ్‌, డెయిలీ వేజ్‌, ఫుల్‌ టైమ్‌ కాంటింజెంట్‌, పార్ట్‌ టైమ్‌ కాంటింజెంట్‌, హోంగార్డులు, అంగన్‌వాడీలు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులు, ఆశాలు, విద్యా వలంటీర్లు, సెర్ఫ్‌, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు, పెన్షనర్లు... ఇలా అందరికీ ప్రయోజనం కలిగేలా వేతనాలను పెంచుతాం...' సీఎం కేసీఆర్‌ నూతన సంవత్సరం సందర్భంగా చేసిన ప్రక టన ఇది. సీఎం చేసిన ఈ ప్రకటనతోనైనా తమ జీవితాలు మారతాయా..? లేదా..? అని రాష్ట్రంలోని బాల కేంద్రాల్లో పని చేస్తున్న కన్సాలిడేటెడ్‌, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌, గౌరవ వేతన ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని బాల బాలికలకు సంగీతం, నాట్యం, గానం, చిత్రలేఖనం, జానపదాలు తదితర లలిత కళలతోపాటు కుట్లు, అల్లికల్లాంటి స్వయం ఉపాధి రంగాల్లో తర్ఫీదునివ్వా లనే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల్లో బాల కేంద్రా లను ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌ పబ్లిక్‌ గార్డెన్స్‌లోగల జవహర్‌ బాలభవన్‌కు ఇవి అనుసంధానంగా పని చేస్తు న్నాయి. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 14 బాల కేంద్రాలు, మరో 7 మినీ బాల భవన్లు ఉన్నాయి. అయితే వాటిలో పనిచేసే అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు పెంచకపోవటంతో వారి జీవితాలు అధ్వాన్నంగా తయారయ్యాయి. పిల్లల మానసిక వికాసానికి, విజ్ఞానానికి ఎంతగానో ఉపయోగపడుతున్న బాల కేంద్రాలపట్ల ప్రభుత్వం చిన్న చూపు చూస్తున్నది. ఉన్నత విద్యనభ్యసించిన వారితోపాటు లలిత కళల్లో డిప్లొమా, పీజీ డిప్లొమాలు, డిగ్రీ, టీటీసీ పూర్తి చేసి ఆయా కేంద్రాల్లో పని చేస్తున్న శిక్షకులు, సిబ్బంది సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. దాదాపు 20 ఏండ్ల నుంచి పని చేస్తున్నప్పటికీ వారికి వేతనాలు ఎంతమాత్రమూ పెరగటం లేదు. ఇప్పటికీ సూపరింటెండెండ్లకు నెలకు రూ.4 వేలు, టీచర్లకు రూ.3 వేలు, ఆయాలు, అటెండర్లకు రూ.వెయ్యి మాత్రమే జీతంగా చెల్లిస్తున్నారు. అది కూడా మూణ్నెల్లకు ఒకసారి ఇవ్వటంతో పలువురు సిబ్బంది ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అదేమంటే మీరు చేసేది పార్ట్‌టైం జాబేగా అంటూ ఉన్నతాధికారులు ఎగతాళి చేస్తున్నారని తెలిసింది. ఈ క్రమంలో తమ వేతనాలను పెంచాలనీ, ఇతర సమస్యలన్నింటినీ పరిష్కరించాలని కోరుతూ 2014 నుంచి ఇప్పటిదాకా తాము ఎక్కని మెట్టూ, దిగని మెట్టూ లేదని బాల కేంద్రాల్లోని ఉద్యోగులు, సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ వచ్చిన కొత్తలో విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగదీశ్‌రెడ్డికి, ఆ తర్వాత అదే శాఖకు మంత్రి అయిన కడియం శ్రీహరికి, ఇప్పటి మంత్రి సబితా ఇంద్రారెడ్డికి అనేకసార్లు వినతి పత్రాలు సమర్పించామని వారు చెబుతున్నారు. దాంతో పాటు ఇటీవల ఎమ్మెల్సీలు అలుగుబెల్లి నర్సిరెడ్డిని, కాటేపల్లి జనార్థన్‌రెడ్డిని కూడా కలిసి తమ సమస్యలను విన్నవిం చుకున్నామని వివరించారు. వారి ద్వారానైనా తమ సమస్య లు ప్రభుత్వం దృష్టికి వెళతాయనే ఆశతో ఉన్నామని తెలిపారు.
మూసివేత దిశగా...
ఏండ్ల నుంచి పని చేస్తున్నా... సర్కారు తమ వేతనాలను పెంచకపోవటంతో ఉద్యోగులు, సిబ్బందిలో అనేక మంది మూడు, నాలుగు వేల వేతనంతోనే ఉద్యోగ విమరణ పొందుతున్నారు. ఇక మిగిలున్న కొద్ది మంది సిబ్బంది ఆ జీతాలతో కుటుంబాలను పోషించలేక బాల కేంద్రాల్లోని ఉద్యోగాలను వదిలి.. వేరే వృత్తులు, పనుల్లోకి వెళ్లిపోతున్నారు. దీంతో 14 బాల కేంద్రాల్లో రెండు ఇప్పటికే మూతబడ్డాయి.
ఇక హైదరాబాద్‌లోని వనస్థలిపురం బాల కేంద్రం మొత్తం మీద ఒక్కరే పని చేస్తున్నారు. ఇక సిద్ధిపేట బాల కేంద్రాన్ని అసలు తెరిచిన దాఖలాలే కనబడటం లేదని తెలిసింది. అంటే ఇవి రెండు కూడా త్వరతోనే మూతబడే అవకాశం ఉందన్నమాట. వేతనాలు పెంచకపోవటం, సిబ్బందిని కొత్తగా నియమించకపోవటం తదితర కారణాల రీత్యా మున్ముందు ఇతర బాల కేంద్రాలకు కూడా ఇదే గతి పట్టే అవకాశం లేకపోలేదని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందువల్ల ఇప్పటికైనా వాటిని పటిష్టం చేయాలని కోరుతున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి
కేపీహెచ్‌బీలో దారుణం
118తో నూరు కష్టాలు
టెస్కాబ్‌ పనితీరు ప్రశంసనీయం
ఫైనలియర్‌ విద్యార్థులకే తరగతులు
కాసింపూర్‌లో కుల బహిష్కరణ
గీత సొసైటీలకు ఇచ్చిన భూములకు పట్టాలివ్వాలి: కేజీకేఎస్‌
వ్యూహాలు.. బుజ్జగింపులు...
రాష్ట్రంలో మహిళా, ట్రాన్స్‌ జెండర్‌ జేఏసీ
బీసీడబ్ల్యూయూ డైరీ ఆవిష్కరణ
యూజర్‌ చార్జీల వసూళ్లపై చర్యలు తీసుకోండి
స్వయం ఉపాధి రుణాల యూనిట్లను పెంచాలి
బడిలో ఉండాల్సిన ఉపాధ్యాయ అభ్యర్థులు రోడ్లపైనా?
విజయడెయిరీ రైతులకు ప్రోత్సాహక బకాయిలివ్వండి
విద్యుత్‌ ఉద్యోగుల పాత్ర చిరస్మరణీయం: మంత్రి కేటీఆర్‌
ఎన్టీఆర్‌ కు చంద్రబాబునాయుడు నివాళి
పీఆర్‌ ఇంజినీరింగ్‌లో ప్రమోషన్ల గొడవ
పథకాల చేరవేతలో అంగన్‌వాడీల పాత్ర కీలకం :మంత్రి సత్యవతి
ఎస్సీ, ఎస్టీలు ఔత్సాహికవేత్తలుగా మారాలి
'జీహెచ్‌ఎమ్‌సీ చట్ట సవరణలపై పిల్‌ ఇప్పుడా...?'
రెవెన్యూలోనే సర్దుబాటు చేయాలి
దోషులకు శిక్షలు పడాలి
స్వాతంత్య్ర సమరయోధుడు బూర్గుల నర్సింగరావు కన్నుమూత
అప్పుల ఊబిలో డిస్కంలు
రైతులతో పెట్టుకున్నోడు ఎవ్వడూ బాగుపడలేదు... : ఎమ్మెల్యే జీవన్‌ రెడ్డి
సీపీఎస్‌ను రద్దు చేయండి

తాజా వార్తలు

10:01 PM

అమిత్‌ షాతో ఏపీ సీఎం జగన్‌ భేటీ

09:51 PM

టాలీవుడ్ యువ హీరో విస్వంత్‌పై కేసు నమోదు

09:32 PM

తెలంగాణ కరోనా వాక్సిన్ బులిటెన్ విడుదల..

09:19 PM

భర్త ఘన విజయం..భుజాలపై ఎత్తుకుని ర్యాలీ తీసిన భార్య

09:03 PM

ఢిల్లీ చేరుకున్న ఏపీ సీఎం జగన్..

08:54 PM

జానారెడ్డి ఇంట్లో కాంగ్రెస్ నేతల సమావేశం

08:44 PM

అడయార్ క్యాన్సర్ ఇన్ స్టిట్యూట్ చైర్ పర్సన్ డాక్టర్ శాంత కన్నుమూత

08:15 PM

ఎమ్మెల్సీగా పోతుల సునీత ఏకగ్రీవం

07:32 PM

ఓఆర్ఆర్‌పై రోడ్డు ప్రమాదం.. ఇద్దరు మృతి

07:23 PM

ఇంగ్లండ్‌తో తొలి రెండు టెస్ట్‌లకు భారత జట్టు ఇదే..

07:11 PM

ఆర్టీసీ డీపోలో విచిత్రమైన ఘటన.. వీడియో వైరల్

07:01 PM

ఈ నెల 29 నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు..

06:51 PM

హైదరాబాద్ లో చిరుత సంచారం కలకలం

06:44 PM

మైలవరంలో లాడ్జిలో వ్యక్తి ఆత్మహత్య

06:29 PM

పోలీస్‌ కస్టడీకి అఖిలప్రియ అసిస్టెంట్లు..

05:58 PM

బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి : సీపీఐ(ఎం)

05:56 PM

నాంపల్లి కోర్టుకు విజయమ్మ, షర్మిల..

05:52 PM

ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లిన సీఎం జగన్

05:40 PM

వాట్సాప్‌కు భార‌త ప్ర‌భుత్వం గ‌ట్టి వార్నింగ్..

05:30 PM

ఆసీస్ మాజీ ప్లేయర్లకు దిమ్మతిరిగే పంచ్ ఇచ్చిన స్పిన్నర్ అశ్విన్

05:26 PM

ఏపీలో 179 కొత్త కేసులు, ఒకరి మృతి

05:21 PM

లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

05:17 PM

పార్లమెంట్ క్యాంటీన్​లో సబ్సిడీ ఎత్తివేత..

05:12 PM

గ‌ణ‌తంత్ర దినోత్స‌వం రోజున ట్రాక్ట‌ర్‌ ర్యాలీ నిర్వ‌హిస్తాం..

05:00 PM

కాళేశర్వం ప్రాజెక్టుతో రైతుల కల నెరవేరింది : కేసీఆర్

04:50 PM

పంచాయతీ ఎన్నికలపై తీర్పును రిజర్వ్ లో ఉంచిన ఏపీ హైకోర్టు

04:42 PM

నరేష్ ‘బంగారు బుల్లోడు’ ట్రైలర్..

04:20 PM

రైతు వ్యతిరేక చట్టాలపై పోరాటం కొనసాగుతుంది : రేవంత్ రెడ్డి

04:12 PM

చిత్తూరులో యువతిని దారుణంగా..

04:12 PM

వంట గ్యాస్ లీకై ఫాస్ట్​ఫుడ్​ సెంటర్​లో మంటలు

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.