Mon Jan 19, 2015 06:51 pm
  • Home
  • About Us
  • Contact Us
  • E-PAPER
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
logo
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • సాహిత్యం
  • మానవి
    • మానవి
    • దీపిక
    • రక్ష
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • వీడియో
  • ఈ-పేపర్
రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి
  • Jan 13,2021

రాష్ట్రానికి కోవిడ్‌ వ్యాక్సిన్‌

- పూణే నుంచి ప్రత్యేక విమానంలో కొవిషీల్డ్‌
- కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి తరలింపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రక్రియ మరో నాలుగు రోజుల్లో ప్రారంభం కానున్న నేపథ్యంలో టీకా మందు రాష్ట్రానికి వచ్చింది. 3.72 లక్షల కొవిషీల్డ్‌ టీకా డోసులతో పూణే నుంచి ప్రత్యేక కార్గో విమానం మంగళవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుంది. అక్కడి నుంచి గ్రీన్‌చానల్‌ ద్వారా కోఠిలోని శీతలీకరణ కేంద్రానికి తరలించారు. కోఠి ఆరోగ్య కేంద్రంలో 40 క్యూబిక్‌ మీటర్ల వాకిన్‌ కూలర్‌ ఏర్పాటు చేశారు. హైదరాబాద్‌,రంగారెడ్డి ఉమ్మడి జిల్లాలు మినహా ఎనిమిది ఉమ్మడి జిల్లాలకు వ్యాక్సిన్‌ను తరలించేందుకు ఫ్రీజర్‌తో కూడిన వాహనాలను సిద్ధంచేశారు. వ్యాక్సిన్‌ రవాణా ప్రక్రియలో అధికారులు అన్ని జాగ్రత్త చర్యలు తీసుకున్నారు. కోఠిలో టీఎస్‌ ఎంఐడీసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వ్యాక్సిన్‌ స్టోరేజీ కేంద్రంలో కోటిన్నర డోసులు భద్రపర్చే అవకాశం ఉంది. జిల్లాల్లో ఉన్న కేంద్రాల్లో సైతం మరో కోటిన్నర డోసులు భద్రపరిచే సామర్థ్యం ఉండటంతో రాష్ట్రంలో 3 కోట్ల డోసులను ఉంచేందుకు కావాల్సిన ఏర్పాట్లు పూర్తయినట్టు అధికారులు స్పష్టం చేశారు. ఈనెల 16 నుంచి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం కానుంది. తొలి రోజు 139 కేంద్రాల్లో 13,900 మందికి కొవిడ్‌ టీకా పంపిణీ చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 1,213 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌కు ఏర్పాట్లు చేస్తున్నారు. వారంలో నాలుగు రోజులు ఉదయం 9గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు కొవిడ్‌ టీకాలు వేయనున్నారు. బుధ, శనివారాల్లో యథావిధిగా సార్వత్రిక టీకాల కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు స్పష్టం చేశారు. అన్ని కేంద్రాల వద్ద అదనంగా టీకాలు అందుబాటులో ఉంచాలని సిఎస్‌ సోమేశ్‌కుమార్‌ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి జిల్లా అధికారులతో సిఎస్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. వ్యాక్సిన్‌ తీసుకునే వారంతా అందుబాటులో ఉండేలా చూడాలనీ, ప్రజాప్రతినిధులందరూ భాగస్వామ్యులయ్యేలా చూడాలని సీఎస్‌ సూచించారు.
2,89,428 మంది నమోదు....
కోవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేసుకునేందుకు వైద్యారోగ్యశాఖలో 2,89,428 మంది తమ పేర్లను నమోదు చేసుకున్నారు. వీరిలో 1,42,706 మంది ప్రభుత్వ సిబ్బంది కాగా, 1,46,722 మంది ప్రయివేటు ఆస్పత్రుల సిబ్బంది ఉన్నారు. రాష్ట్రంలో 866 కోల్డ్‌ చైన్‌ పాయింట్లను, 1213 వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేసిన అధికారులు, 1,42,706 మంది వ్యాక్సినేటర్లను నియమించారు. వ్యాక్సిన్‌ వేసుకునేందుకు పేర్లు నమోదు చేసుకున్న వారిలో అత్యధితంగా హైదరాబాద్‌ జిల్లాలో 78,226 మంది ఉండగా ములుగు జిల్లాలో అతి తక్కువగా 2104 మంది ఉన్నారు. రంగారెడ్డిలో 26,078, వరంగల్‌ అర్బన్‌ 11,854,కామారెడ్డిలో 11,775 మంది, కరీంనగర్‌ 11,918, మేడ్చల్‌ మల్కాజిరిగి జిల్లాలో 14,702, నిజామాబాద్‌ 11,068 మంది పేర్లను రిజిస్ట్రేషన్‌ చేసుకున్నారు. జయశంకర్‌ భూపాలపల్లిలో 2191, కొమురంభీం ఆసిఫాబాద్‌ లో 2726, నారాయణపేటలో 2190, రాజన్న సిరిసిల్లలో 2661, వనపర్తిలో 2875 మంది ఉన్నారు.
ఆస్పత్రుల వారీగా.......
వ్యాక్సినేషన్‌ కేంద్రాలుగా ఎంపిక చేసిన వాటిలో ప్రయివేటు బోధనాస్పత్రులు ఆరు, ప్రయివేటు ఆస్పత్రులు 34 మొత్తం 40 ఉన్నాయి. ప్రభుత్వాస్పత్రుల్లో ప్రాథమిక కేంద్రాలు 25, అర్బన్‌ ప్రైమరీ హెల్త్‌ సెంటర్లు 15, కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్లు 21, ఏరియా ఆస్పత్రులు 12, జిల్లా ఆస్పత్రులు 20, ప్రభుత్వ బోధనాస్పత్రులు మొత్తం 99 ఉన్నాయి. కాగా తొలి రోజు ఈ నెల 16న 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్‌ జరగనున్నది. గాంధీ ఆస్పత్రితో పాటు నార్సింగి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగే వ్యాక్సినేషన్‌ సందర్భంగా ప్రధానమంత్రి ఆ కేంద్రాల్లో ఉన్న వారితో ముచ్చటించనున్నారు.

మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఫిట్‌ మెంట్‌ 7.5 శాతం
అప్పుల బాధతో ముగ్గురు రైతుల మృతి
రైతుల పక్షమా.. కార్పొరేట్ల పక్షమా..
లేబర్‌ కోడ్‌లు, రైతు చట్టాలు రద్దు చేసేంత వరకూ పోరు
పల్లెల అభివృద్ధికి ఫ్రీజింగ్‌
వంటి మామిడి మార్కెట్‌లో కోల్డ్‌ స్టోరేజ్‌
రైతులకు అండగా నిలుద్దాం
సాగు చట్టాలతో రైతులకు తీవ్ర నష్టం
రాష్ట్ర బడ్జెట్‌లో రూ.5వేల కోట్లు కేటాయించాలి
పీఆర్సీ నివేదిక చెత్తబుట్టలో వేస్తున్నాం...
మాకొద్దీ పీఆర్సీ ...
వీఐటీలో ఘనంగా గణతంత్ర వేడుకలు
పిల్లలను పంపేందుకు...60 శాతం తల్లిదండ్రులు సమ్మతి
కుబేరులకు దోచిపెడుతున్న కేంద్రం
పేద బ్రాహ్మణుల సంక్షేమానికి కృషి
గొర్రెల పంపిణీని వేగవంతం చేయాలి
పద్మశ్రీ కనకరాజుకు సన్మానం
మహిళా సిబ్బంది పనితీరు భేష్‌
వికలాంగుల చట్టాల అమలుకు ఉద్యమం
వీఆర్వోలకు సీనియర్‌ అసిస్టెంట్ల స్కేలు ఇవ్వాలి
ఐదో అంతస్తు నిర్మాణం అనుమతి కోసం చర్యలేం తీసుకున్నారో చెప్పండి
నింబోలి అడ్డా హాస్టల్‌ విద్యార్థులు ఆందోళన పడొద్దు
కొత్త సచివాలయంలో గుడి, మసీదు, చర్చిలను నిర్మిస్తాం- మంత్రులు
ఏఎంఆర్‌పీ డిస్ట్రిబ్యూటరీ కాల్వకు గండి
ఫిట్‌మెంట్‌ పేరుతో కొత్త డ్రామా : బండి
ప్రభుత్వ కనుసన్నల్లోనే పీఆర్సీ నివేదిక : చాడ
క్యారెక్టర్‌ లేని జగదీశ్‌ రెడ్డి : ఎమ్మెల్యే జగ్గారెడ్డి
జీవో 34 అమలుకు గడువు కావాలి
ఆర్టీసీ రక్షణకు నిధులు కేటాయించండి
తిరోగమన దిశలో పీఆర్సీ రిపోర్టు..పోరుబాటే కరెక్టు : సీఐటీయూ

తాజా వార్తలు

09:47 PM

సింగరేణి ఓపెన్ కాస్ట్ లో ప్రభాస్ 'సలార్'

09:28 PM

హైదరాబాద్ లో విషాదం..

09:20 PM

31లోగా పదోన్నతుల ప్రక్రియ పూర్తిచేయాలి : సీఎస్‌

08:56 PM

ఖమ్మం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆటో డ్రైవర్ మృతి

08:46 PM

ఉద్యోగుల ఆశల మీద పీఆర్సీ రిపోర్ట్ నీళ్లు చల్లింది : రేవంత్

08:29 PM

సినీ ప్రేక్షకులకు గుడ్ న్యూస్..

08:26 PM

వాటిని కేంద్రపాలిత ప్రాంతాలుగా ప్రకటించాలి: ఉద్ధవ్ థాక్రే

08:16 PM

వన్డే ర్యాకింగ్స్.. కోహ్లీ @1, రోహిత్ @2..

08:09 PM

యాద్రాద్రి అభివృద్ధి పనులపై మంత్రి ప్రశాంత్ అసంతృప్తి..

08:03 PM

ఎర్రకోటను ముట్టడించిన వారంతా ఉగ్రవాదులే : బీసీ పాటిల్

08:00 PM

ఉగ్రవాదుల గ్రనైడ్ దాడిలో జవాను మృతి

07:57 PM

వైల్డ్‌లైఫ్‌ వార్డెన్లుగా సర్పంచ్‌లు.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

07:53 PM

దేశంలో 23లక్షలు దాటిన టీకా లబ్ధిదారుల సంఖ్య..

07:38 PM

ముళ్ల పొదల్లో కాలిపోయిన మృతదేహం లభ్యం..

07:36 PM

దారుణం..పసికందును పీక్కుతున్న​ కుక్క

07:28 PM

క్వారంటైన్​ నిబంధనల ఉల్లంఘనకు రూ.25లక్షల జరిమానా..

07:18 PM

ఉద్యోగులతో పాటు పోరాటం చేసేందుకు కాంగ్రెస్​ సిద్ధం..

07:17 PM

ఘనంగా టీవీ యాంకర్‌ పెళ్లి

07:03 PM

మార్కెట్‌లో రైతులు, వ్యాపారులతో ముచ్చటించిన కేసీఆర్

06:58 PM

ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి : ఎస్‌ఈసీ ఆదేశం

06:55 PM

చెకప్‌ కోసమే గంగూలీ ఆస్పత్రికి వచ్చారు: అపోలో

06:43 PM

సాగు చట్టాలను వెంటనే వెనక్కి తీసుకోండి : రాహుల్

06:30 PM

ఈ వెబ్‌సైట్ లలో ఏమీ కొనోద్దు.. పోలీసుల ప్రకటన

06:26 PM

హరీశ్ రావును కలిసిన తెలంగాణ గ్రామ రెవెన్యూ అధికారుల సంఘం

06:14 PM

రైతులపై పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నం : తమ్మినేని

06:12 PM

జీహెచ్ఎసీలో బీజేపీ కార్పోరేటర్ పై కేసు నమోదు..

06:05 PM

మత్స్యకారుల అభివృద్ధి కోసం ప్రభుత్వం చర్యలు : తలసాని

06:02 PM

ఏపీలో 111 కొత్త కేసులు

05:59 PM

విశ్వసనీయతలేని పే-రివిజన్ కమిటీ రిపోర్టు : ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

05:50 PM

ప్రాణం పోయినా కదిలేది లేదు..

మరిన్ని వార్తలు

ఈ-పేపర్

×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required

జోష్

టెక్ ప్లస్

సోర్స్ కోడ్

సోపతి

సంపాదకీయం

కొలువు

దర్వాజ

వేదిక

కిసాన్

జరదేఖో

తాజా వార్తలు

రాష్ట్రీయం

ఆటలు

నవచిత్రం

బిజినెస్

నయామాల్

షో

రక్ష

బుడుగు

మానవి

  • Home
  • Contact Us
  • Powered by OSSLIB
© Copyright Navatelangana.com 2015. All rights reserved.