Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా నేపథ్యంలో ప్రభుత్వ, ప్రయివేటు విద్యాసంస్థల్లో ఫీజులను 50 శాతానికి తగ్గించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన సీఎం కేసీఆర్‌కు గురువారం నాడు లేఖ రాశారు. ప్రయివేటు పాఠశాలలు, కాలేజీలకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం గ్రాంటు కేటాయించి తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్న టీచర్లు, లెక్చరర్లు, సిబ్బందికి వేతనాలు అందేలా చూడాలని కోరారు. 40 వేల టీచర్ పోస్టులను, జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలలు, యూనివర్సిటీల్లో బోధన, బోధనేతర సిబ్బందిని నియమించాలని విన్నవించారు. వర్సిటీలకు వైస్ చాన్స్‌లర్లను నియమించాలని కోరారు. డీఈఓ, ఎంఈఓ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో టీచింగ్, నాన్‌టీచింగ్ సిబ్బందికి కరోనా వ్యాక్సిన్లు ఇవ్వాలని కోరారు.