Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థలో తొలివిడతగా 372 పోస్టులకు సంబంధించి నోటీఫికేషన్ విడుదల చేస్తున్నట్టు సింగరేణి చైర్మెన్, ఎమ్‌డీ ఎన్.శ్రీధర్ గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆన్‌లైన్‌లో ఈ నెల 22వ తేదీ నుంచి ఫిబ్రవరి 4వ తేదీ సాయంత్రం ఐదు గంటల వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కేవలం రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా మాత్రమే అభ్యర్థుల ఎంపిక ఉంటుందనీ, దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ నోటిఫికేషన్‌లో 7 రకాల ఉద్యోగాలకు దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. 305 పోస్టులను లోకల్ ( ఉమ్మడి కరీంనగర్, అదిలాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాలు) అభ్యర్థులకు ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. మిగిలిన 67 పోస్టులకు యావత్ తెలంగాణ వారు అర్హులని పేర్కొన్నారు. వయోపరిమితి, విద్యార్హతలు, జీతభత్యాలు, ఫీజు చెల్లింపు మొదలైన వివరాలను సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ వెబ్ సైట్ షషష.రషషశ్రీఎఱఅవర.షశీఎని సంప్రదించాలని సూచించారు. ఉద్యోగాలిప్పాస్తామని మోసకారుల మాటలను నమ్మవద్దనీ, అలా ఎవరైనా ప్రలోభపెడితే సింగరేణి విజిలెన్సు శాఖకు తెలియజేయాలని సూచించారు,