Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎం అయ్యాక రైల్వే ఉద్యోగులను కాపాడాలి
- రైల్వే ఎంప్లాయీస్ సంఫ్‌ు డివిజనల్ ఆఫీస్ ప్రారంభంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు
- ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తే ఉద్యమాలకు సిద్ధం : కేటీఆర్
నవతెలంగాణ- ఓయూ
'కాబోయే సీఎం కేటీఆర్‌కు శాసన సభ, రైల్వే కార్మికుల తరపున శుభాకాంక్షలు. మీరు సీఎం అయ్యాకు రైల్వే ఉద్యోగులను కాపాడాలి' అని గురువారం సికింద్రాబాద్‌లో దక్షిణ మధ్య రైల్వే ఎంప్లాయీస్ సంఘ్ కార్యాలయం ప్రారంభోత్సవ సభలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు మంత్రి కేటీఆర్ సమక్షంలోనే వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమానికి మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, పువ్వాడ అజరు కూడా హాజరయ్యారు. వీరందరి సమక్షంలోనే కేటీఆర్‌ను సీఎం అంటూ పద్మారావు సంబోధించడంతో అందరి మొఖాల్లో సంతోషం కనిపించింది. కేటీఆర్ సీఎం కాబోతున్నారంటూ కొన్ని రోజులుగా ఆయా సందర్భాల్లో పలువురు మంత్రులు, టీఆర్‌ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు చేసిన వ్యాఖ్యలకు ఇప్పుడు మరింత బలం చేకూరినట్టయింది. కేటీఆర్‌ను సీఎంగా ప్రమోట్ చేసే ప్లాన్ ఎప్పుడో ప్రారంభమైందని పలువురు చర్చించుకుంటున్నారు. మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. ప్రపంచంలోనే రైల్వే ఒక గొప్పస్థితిలో ఉండటానికి కార్మికుల, ఉద్యోగుల కృషి ఎంతో ఉందన్నారు. తెలంగాణ ఉద్యమం రైల్‌రోకో కార్యక్రమాల్లోనూ అన్నింటా స్నేహభావంతో మెలిగామన్నారు. రైల్వే వోగన్ కోచ్ ఫ్యాక్టరీని కాజీపేటలో నిర్మిస్తామని చెప్పిన కేంద్రం ఇప్పటి వరకూ ఏమీ చేయలేదన్నారు. దక్షిణాది రాష్ట్రాలను కేంద్రం చిన్నచూపు చూస్తోందని చెప్పారు. బుల్లెట్ ట్రైన్‌ను అందుబాటులోకి తేవాలన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రం నిర్వీర్యం చేస్తే ఉద్యమాలకు సిద్ధం అవుతామని హెచ్చరించారు. రాబోయే కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణ రాష్ట్రానికి, దక్షిణాదికి తగిన న్యాయం చేయాలన్నారు. నూతన ప్రాజెక్టులను కేటాయించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే ఉద్యోగులు, కార్మికులు, దక్షిణ మధ్య రైల్వే ఉద్యోగుల సంఘ్ ప్రధాన కార్యదర్శి రాఘవయ్య తదితరులు పాల్గొన్నారు.