Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇందిరాపార్కు మహాధర్నాలో కె. సూర్యం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కస్తూర్భా గాంధీ బాలికా విద్యాలయాల్లో పనిచేస్తున్న నాన్‌టీచింగ్, కార్మికులకు కనీస వేతనాలివ్వాలనీ, వారి సమస్యలను పరిష్కరించాలని ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.సూర్యం రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లోని ఇందిరా పార్కువద్ద ప్రగతిశీల కస్తూ ర్భాగాంధీ బాలికా విద్యాలయాల నాన్‌టీచింగ్, వర్కర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహాధర్నాను గురువారం నిర్వహించారు. ప్రజా కళాకారుడు ఏపూరి సోమన్న పాడిన పాటలు పలువురిని ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేజీవీబీలలో సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఎందుకు ఇవ్వ ట్లేదని ప్రశ్నించారు. వారికి కనీస వేతనాల జీవోనైనా వర్తిం పజేయాలన్నారు. వారాంతపు సెలవులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల పట్ల వివక్ష చూ పుతున్నదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఆ అసోస ియేషన్ నాయకులు శోభ, షాహిదా, బాలమణి, సైదమ్మ, అరుణ, నర్సమ్మ, స్వప్న, పి.స్వప్న, అనిత, సుశీల, కరుణ కుమారి, నాగమణి, ఈశ్వరి, రాములమ్మ, తదితరులు పాల్గొన్నారు.