Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీల దిష్టిబొమ్మ దహనం
- ఎల్గోయి గ్రామంలో రైతుల నిరసన
నవతెలంగాణ-ఝరాసంగం
సంగారెడ్డి జిల్లా ఝరాసంగం మండలం బర్దిపూర్ గ్రామ శివారులో బుధవారం నిర్వహించిన నిమ్జ్ ప్రజాభిప్రాయ సేకరణ ఏకపక్షంగా జరిగిందని ఎల్గోయి గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గురువారం ఎల్గోయి గ్రామస్థులు ఎంపీ బీబీపాటిల్, ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్ దిష్టిబొమ్మ
దహనం చేశారు. గ్రామ ప్రారంభం నుంచి చివరి వరకు దిష్టిబొమ్మను డప్పులతో ఊరేగిస్తూ నిరసన తెలిపారు. పోలీసు పహారాలో రాజకీయ నాయకుల సమక్షంలో సేకరించారనీ, రైతులను ఎక్కడికక్కడ అడ్డుకొని తమ అభిప్రాయాలు చెప్పకుండా చేశారన్నారు. కలెక్టర్ హనుమంతరావు స్పందించి ప్రజాభిప్రాయ సేకరణ సభను తిరిగి నిర్వహించాలని రైతులు విజ్ఞప్తి చేశారు. రైతులకు మద్దతివ్వని నాయకులు డౌన్.. డౌన్.. అంటూ నినాదాలు చేశారు. కార్యక్రమంలో భూ బాధిత రైతులు శంకర్, నర్సింలు, విట్టల్, చంద్రప్ప, బాలప్ప, యేసయ్య, యువకులు పాల్గొన్నారు.