Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రైతు ఉద్యమం చారిత్రాత్మకమైంది
- 26న లక్ష ట్రాక్టర్లతో ర్యాలీ : కార్మిక, కర్షక ధర్నాలో ఏఐకేఎస్ నేత విజ్జుకృష్ణన్
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
ఎర్రజెండా ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత దేశంలో జరుగుతున్న రైతాంగం ఉద్యమం చారిత్రాత్మకమైందని ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజ్జూకృష్ణన్ వ్యాఖ్యానించారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఉద్యమం చరిత్ర సృష్టిస్తున్నదని తెలిపారు. దేశాన్ని వణికించిన కరోనానే ఈ ఉద్యమం ఓడించిందనీ, నరేంద్రమోడీ కూడా ఓటమి తప్పదని హెచ్చరించారు. జాతీయోద్యమం తర్వాత కార్మిక, కర్షకుల మధ్య ఐక్యతను పెంచింద న్నారు. సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ, విద్యుత్ సవరణ బిల్లును ఉప సంహరించుకోవాలంటూ ఢిల్లీలో కొనసాగుతున్న ఉద్యమానికి మద్దతు తెలుపుతూ శనివారం హైదరాబాద్‌లోని ఎస్‌వీకే పార్కులో కార్మిక,కర్షక ధర్నా జరిగింది. దీనికి ఏఐకేఎస్‌సీసీ రాష్ట్ర కన్వీనర్లు టిసాగర్, పశ్యపద్మ, కె రంగయ్య, అచ్యుతా రామారావు, కన్నెకంటి రవి అధ్యక్షవర్గంగా వ్యవహరించారు. ఉద్యమంలో మరణించిన రైతులకు సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా విజ్జుకృష్ణన్ మాట్లాడుతూ సాగు చట్టాలను రద్దుకోసమే కాకుండా ప్రత్యామ్నాయ విధా నాల కోసం పోరాటం జరుగుతున్నదన్నారు. కేరళ రాష్ట్రంలో రూ 3600 కోట్లతో సంక్షేమ కేరళ అమలు చేస్తున్నట్టు తెలిపారు. 90 లక్షల మందికి ఫూడ్‌కిట్స్, 60వేల మందికి పెన్షన్ ఇస్తున్నట్టు తెలిపారు. విద్య, వైద్య, రేషన్, సామాజిక భద్రతను కల్పిస్తున్న కేరళ తరహాలోనే దేశ వ్యాపితంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ ఉద్యమం నుంచి మహిళలు వెనక్కి పోవాలని సుప్రీం కోర్టు సూచించడం సరైందికాదన్నారు. వ్యవసాయంలో అత్యధికంగా మహిళల శ్రమ ఉన్నదని వివరించారు. కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితోనే ఉద్యమం ఉధృతమవుతున్నదన్నారు. 26నఢిల్లీలో లక్ష ట్రాక్టర్లతో రైతులు పరేడ్ నిర్వహించబోతున్నారని తెలి పారు. జాతీయ రహదారులను ఐదులక్షల మంది దిగ్భంద నం చేశారన్నారు. ఈ పోరాటం రైతులు గెలిచేదాకా జరుగు తుందన్నారు. కేంద్రంలో బీజేపీకి అధికారంలోకి రావడానికి రైతులకు ఎన్నో హామీలు ఇచ్చిందనీ, అందులో ఏ ఒక్కటీ అమలు చేయలేదని విమర్శించారు. కార్పొరేట్ కంపెనీలకు అనేక రాయితీలు ప్రకటించిందన్నారు. వ్యవ సాయ సంక్షే మం, ఆర్థికమాంద్యం, కరోనా పరిస్థితులను ఎదుర్కొవడం లో కేంద్రం విఫలమైందన్నారు. సంవత్సరానికి దేశంలో 12 వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవే దన వ్యక్తంచేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ అభ్యర్థి, ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మాట్లాడుతూ కార్మిక, రైతు చట్టాల్లో వ్యాపారులు వ్యాపారం చేసుకోవచ్చు అనేది ఉంటే అభ్యంత రం పెట్టాల్సిన అవసరం లేదు కానీ ప్రయివేటు కంపెనీలు దోపిడీ చేసుకోవడానికి అవకాశం కల్పించిందని విమర్శిం చారు. వ్యవసాయ ఉత్పత్తుల ద్వారా రూ 18 లక్షల కోట్ల వ్యాపారం జరుగుతున్నదన్నారు. దీంతో రైతులు తమ ధాన్యాన్ని అమ్మే స్వేచ్ఛ లేకుండా చేసిందన్నారు. 31 పంటలకు మద్దతు ధర ఉండగా, 29 పంటలను ప్రయివేటు వ్యాపారులే కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. వ్యవసాయ మార్కెట్ల ద్వారా కేవలం 6శాతం మాత్రమే కొనుగోలు చేస్తు న్నారనీ, ఈచట్టాలతో అది కూడా ఉండదన్నారు. రైతుకు అన్యాయం జరిగితే కోర్టుకు పోయే అవకాశం లేకుండా చేసిందనీ, ఇది రాజ్యాంగ విరుద్ధమ న్నారు. కాంట్రాక్టు వ్యవ సాయం ఒప్పందం వల్ల రైతులకు తీవ్రమైన నష్టం జరుగు తుందని చెప్పారు. ఏఐకేఎస్‌సీసీ జాతీయ నాయకులు విస్సా కిరణ్ మాట్లాడుతూ ప్రజాస్వా మ్య పరిరక్షణ కోసం ఉద్యమన్నారు. రైతులు విజయం సాధిస్తే దేశం విజయం సాధిస్తున్నదని చెప్పారు. స్వేచ్ఛ, స్వాతంత్రాలు ఎవరో ఇస్తే వచ్చేవి కావనీ, అందుకు రక్త చిందించాల్సిందేనని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ చెప్పిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి జంగారెడ్డి, ఉపాధ్యక్షులు నంద్యాల నర్సింహారెడ్డి, మాదినేని లక్ష్మి, విఎస్ బోస్ (ఏఐటీయూసీ), జె వెంకటేష్ (సీఐటీయూ), జి రాంబాబు (టీఆర్‌ఎస్‌కేవీ), సూర్యం (ఐఎఫ్‌టీయూ), ఎం శ్రీనివాస్ (ఐఎఫ్‌టీయూ), ఎంకే బోస్ (టీఎన్‌టీయూసీ), జిటి గోపాలా రావు (డిఫెన్స్), జి తిరుపతయ్య (బ్యాంకింగ్), క్లెమెట్ (ఎల్ ఐసీ), రాజు భట్టు (మెడికల్ రిప్స్), కె భాస్కర్ (కేవీపీఎస్), శ్రీరాంనాయక్ (టీజీఎస్), బి ప్రసాద్, బొప్పని పద్మ (వ్యకాస), అబ్బాస్ (ఆవాజ్), ఎంవి రమణ (వృత్తిదారులు) పార్ధసారధి (ఐలు), ఎస్‌ఎల్ పద్మ, అరుణ (ఐఎఫ్‌టీయూ), వి నాగేశ్వరరావు, అజీజ్ (కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు)తో పాటు సివిల్ సప్లయిస్ సంఘం నాయకులు పాల్గొన్నారు.
తొలుత నిరాకరించిన పోలీసులు
ఏఐకేఎస్‌సీసీ ధర్నాకు అనుమతి విషయంలో ఇటు సర్కారు, అటు పోలీసులు దాగుమూతలు ఆడారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించాలనుకున్న మహపడావ్‌కు తొలుత పోలీసులు అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత బాగ్‌లింగంపల్లి మార్చుకుని, పార్కులో చేసుకోవాలని సూచించారు. కొద్దిసేపు తర్వాత అక్కడ కూడా వద్దంటూ అభ్యంతరాలు చెప్పారు.
దీంతో ఆగ్రహం చెందిన ఏఐకేఎస్‌సీసీ కన్వీనర్ టి సాగర్ పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పార్కులో వంటావార్పు చేసుకోవడానికి పోలీసులు నిరాకరించడంతో పక్కనే ఉన్న మరో ప్రాంతంలో ధర్నాకు వచ్చిన ఆయా సంఘాల నాయకులు, కార్యకర్తలకు వంట చేసి భోజనం పెట్టారు. అంతకు ముందు ఉదయం 10 గంటల నుంచే ధర్నాకు రైతులు, మహిళలు,యువత రావడం ప్రారంభించారు. ఈ సందర్భంగా పల్లకార్డులు, ఫ్లెక్సీలు ప్రదర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వందలాదిగా తరలి వచ్చిన రైతులతో సుందరయ్యపార్కు ప్రాంగణంలో కిటకిటలా డింది. మోడీ డౌన్‌డౌన్, పోలీసు జులుం నశించాలని, మూడు చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.