Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేసీఆర్‌పై పొన్నాల ఆగ్రహం
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో నిర్మాణమవుతున్న సాగునీటి ప్రాజెక్టుల్లో నెలకొన్న అవినీతి, అక్రమాలపై సీఎం కేసీఆర్‌కు దమ్ములేకనే లీకులు ఇస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య విమర్శించారు. ఆదివారం తనను కలిసిన విలేకర్లతో మాట్లాడారు. బయటకు వచ్చి మాట్లాడటానికి సీఎంకు ముఖం లేదా? ప్రశ్నలు అడిగితే సమాధానం చెప్పే ధైర్యం లేదా? అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సాగు భూమి ఉన్నది ఎంత? కోటి పది లక్షల ఎకరాలకు నీరు ఎలా ఇస్తారు. ఏడాదిలో పాలమూరు- రంగారెడ్డి ఆరు నెలల్లో దిండి ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారు? ఏడేండ్లలో కానిది ఏడాదిలో సాధ్యం అవుతుందా? అని ప్రశ్నించారు. తన పాపాలు కేటీఆర్‌కు అంటగట్టడానికే కొడుకును సీఎం చేస్తానని కేసీఆర్ అంటున్నారని అభిప్రాయపడ్డారు. వైఎస్ షర్మిల పార్టీ ఏపీలో పెట్టుకుంటే బాగుంటుందని ఒకప్రశ్నకుసమాధానమిచ్చారు.