Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఏపీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాల బార్ కౌన్సిళ్ల చైైర్మెన్లు డిమాండ్ చేశారు. ఆదివారం తెలంగాణ బార్ కౌన్సిల్ సభ్యులు బి కొండారెడ్డి నిర్వహించిన వెబినార్ ద్వారా వారు మాట్లాడారు. తెలంగాణ బార్ కౌన్సిల్ ఛెర్మెన్ ఏ నర్సింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ చైైర్మెన్ జి రామారావు, కేరళ బార్ కౌన్సిల్ చైైర్మెన్ కెపి జయ చంద్రన్, తమిళనాడు బార్ కౌన్సిల్ చైైర్మెన్ పి అమల్‌రాజ్ ప్రసంగించారు. దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏ ర్పాటు చేయాలనే చట్టబద్ధమైన డిమాండ్ కొత్తదేమీ కాదన్నారు. ఈ అంశం దీర్ఘకాలికంగా పెండింగ్‌లో ఉన్నదని చెప్పారు.
భారతదేశ రాజ్యాంగం ప్రకారం న్యాయ సమ్మతి నిర్ణయాలను, ప్రాథమిక హక్కులను కేంద్ర ప్ర భుత్వం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు దూరం కార ణంగా అప్పీల్ రేటు దక్షిణ రాష్ట్రాల నుంచి 3.1శాతం మాత్రమే ఉన్నదని గణాంకాలు చెబుతున్నాయన్నారు. సుప్రీంకోర్టు వేల కిలో మీటర్ల మేర ఉండటం, ప్రయాణ సమయం, ఖర్చు, వసతి సమస్య వంటి సమస్యలను న్యాయ వాదులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం అధికార పరిధిలో బెంచ్ నిర్ణయం అవసరమనీ, ఈ నిర్ణయం రాజ్యాంగంలోని ఆర్టికల్ 130 ప్రకారం సీజేఐ, రాష్ట్రపతి ఆమోదంతో నిర్ణయం తీసుకోవచ్చన్నారు. 10,11.18వ లాకమిషన్ నివేదికలు బెంచ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నాయని గుర్తు చేశారు. పార్లమెంటరీ స్థాయి సంఘం తన 2,6,15,20,26,28 నివేదికల్లో దేశంలోని దక్షిణ భారతదేశంలో సుప్రీంకోర్టు బెంచ్‌ను ఏర్పాటు చేయాలని ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం పునరాలోచించి సత్వరమే దక్షిణాది ప్రాంతంలో బెంచ్‌ను ఏర్పాటు చేయాలనీ, అన్ని దక్షిణ రాష్ట్రాల బార్ కౌన్సిల్ చైైర్మెన తీర్మానం చేసినట్టు తెలిపారు.