Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒప్పందం ప్రకారం తెల్లజొన్నలు కొనని వ్యాపారి
- ఆయన ఇంటి ఎదుట బైటాయించిన రైతులు
- దిగి వచ్చిన వ్యాపారి.. రూ.3200కు కొంటానని హామీ
నవతెలంగాణ-మోర్తాడ్
ఢిల్లీలో తెల్లజొన్నలకు ధర లేదు.. కావున పంట కొనుగోలు చేయబోనని వ్యాపారి చెప్పడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. బై బ్యాక్ ప్రకారం విత్తనాలు విక్రయించి, ఇప్పుడు కొనుగోలు చేయకపోతే పంటను ఏం చేసుకోవాలని రైతులు ప్రశ్నించారు. ఒప్పందం ప్రకారం పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ మండలం షట్పల్లిలోని వ్యాపారి ఇంటి ఎదుట శుక్రవారం బైటాయించారు. రైతుల వివరాల ప్రకారం..షట్పల్లి గ్రామానికి చెందిన తెల్లజొన్న వ్యాపారి లింగన్న గ్రామంలోని రైతులకు బై బ్యాక్ ఒప్పందం ప్రకారం విత్తనాలు విక్రయి ంచారు. సీడ్ ఇచ్చే సమయంలో మార్కెట్‌లో జొన్నల ధర క్వింటాలకు రూ.2500 నుంచి 2600 పలుకగా, ఇంతకంటే తక్కువ కాకుండా, పంట చేతికి వచ్చే సమయంలో అధిక ధర ఉంటే ఆ ధర ప్రకారం పంటను కొనుగోలు చేస్తానని రైతులతో ఒప్పందం కుదు ర్చుకున్నాడు. ప్రస్తుతం పంట చేతికి వచ్చి పది రోజులవుతున్నా కొనుగోలు చేయక పోవడంతో పలుమార్లు రైతులు వ్యాపారిని సంప్రదించారు. ప్రస్తుతం తెల్లజొన్నలు క్వింటాలుకు రూ.3450 పలుకుతోంది.
ఈ క్రమంలో వ్యాపారి పంటను కొనేందుకు ముందుకు రావడం లేదు. ప్రస్తుతం ఉన్న ధర పెట్టలేక.. ఢిల్లీ మార్కె ట్లో ధర లేదని సాకులు చెబుతూ.. తమకు నచ్చిన వారికి విక్రయాలు జరు పుకో వాలని దాటవేస్తూ వచ్చాడు. దాంతో గ్రామ రైతులంతా కలిసి శుక్రవారం వ్యాపారి ఇంటి ఎదుట బైటాయించారు. గ్రామం మొత్తంగా 12వేల క్వింటాళ్లవరకు తెల్లజొన్న దిగుబడి వచ్చిందని, ఒప్పందం ప్రకారం కొనుగోలు చేయక పోతే.. ఎవరికి విక్రయించాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం మార్కెట్‌లో ఎక్కువ ధర పలుకు తుండటంతో.. ఆ ధర ఇవ్వాల్సి వస్తుందని కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవే దన వ్యక్తం చేశారు. ఇప్పుడున్న ధర ప్రకా రం పంట మొత్తం కొనుగోలు చేసే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించు కూర్చున్నారు. చివ రకు రూ.3200 పంటను కొంటానని వ్యాపారి హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.