Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మెరుగుపడని సీఐడీ :గవర్నర్‌కు ఫోరంఫర్ గుడ్ గవర్నెన్స్ ఫిర్యాదు
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర సీఐడీ విభాగం పని తీరు పరమ అధ్వాన్నంగా మారిందని ఈ శాఖ పని తీరును మెరుగు పరచేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర గవర్నర్ తమిళసై కి ఫోరంఫర్ గుడ్‌గవర్నెన్స్ శనివారం ఫిర్యాదు చేసింది. ఈ వివరాలను సస్థ ప్రధాన కార్యదర్శి పద్మనాభరెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో తీవ్రమైన నేరాలకు సంబంధించిన నిగ్గు తేల్చడానికి గాను సీఐడీ విభాగాన్ని ఏర్పాటు చేశారని కానీ ఆ సంస్థ ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని ఆయన ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు సీఐడీలో 242 తీవ్రమైన కేసుల విచారణ పెండింగ్‌లో ఉండగా రాష్ట్రం ఏర్పడిన తర్వా త ఆ సంఖ్య 450 కేసులకు పెరిగిందని ఆయన తెలిపారు. అలాగే కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రతి ఏటా ఐదు కోట్ల రూపాయల మేరకు సీఐడికి కేటాయిస్తున్నారని ఇదే ఉమ్మడిరాష్ట్రం ఉన్నప్పుడు ఏటా కోటి 60 లక్షల రూపాయలు కేటాయించే వారని నిదులు పెరిగినా పని తీరులో మాత్రం ఏమాత్రం పురోగతి లేక పోగా మరింత అధ్వాన్నంగా సీఐడీ తీరు సాగుతున్నదని ఆరోపించారు.