Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇది న్యాయ వ్యవస్థపైనే దాడి
- రాష్ట్రంలో రాక్షస పాలన :టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి
- న్యాయవాది వామన్‌రావు కుటుంబ సభ్యులకు పరామర్శ
నవతెలంగాణ - మంథని
న్యాయవాది వామన్‌రావు దంపతుల హత్య కేసును సీబీఐచే విచారణ జరిపిస్తే నిజాలు బయటపడతాయని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం గుంజపడుగు గ్రామంలోని న్యాయవాది వామనరావు కుటుంబ సభ్యులను శనివారం ఉత్తమ్ కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కాంగ్రెస్ పార్టీ నేతలు పరామర్శించారు. జంట హత్యలపై వామన్‌రావు తండ్రిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ.. హైకోర్టు న్యాయవాద దంపతుల హత్య రాష్ట్రాన్ని కుదిపేసిందన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వంగవీటి రంగా హత్య.. రాజకీయాలను ఏ విధంగా మార్చేసిందో.. ఇప్పుడు న్యాయవాద దంపతుల హత్య కూడా టీఆర్‌ఎస్ పతనానికి కారణం అవుతుందన్నారు. పోలీస్ కస్టడీలో ఆత్మహత్య చేసుకున్న శీలం రంగయ్య కేసుకు సంబ ంధించి హైకోర్టులో వామన్‌రావు-నాగమణి పిల్ వేశారన్నారు. అప్పటి నుండే పోలీసుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమకు ప్రాణ భయం ఉందని సెప్టెంబర్ నెలలోనే ఆ దంపతులు హైకోర్టులో వాం గ్మూలం ఇచ్చారని తెలిపారు. అందువల్ల వారి హత్యలో స్థానిక పోలీసుల హస్తం ఏదో విధంగా ఉందని ఆరోపించారు. స్థానిక టీఆర్‌ఎస్ నాయ కుల అవినీతిపై, ప్రజల పక్షాన కేసులు వేశారని, దాని పర్యవసానంగానే హత్య జరిగిందన్నారు. గ్రామంలోని రామాలయానికి ఈ హత్యకు ఎలాంటి సంబంధమూ లేదని కుటుంబ సభ్యులు చెబుతున్నప్పటికీ పోలీసులు ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ అక్రమాలు, అరాచకాలు పెరిగిపోతున్నాయని విమర్శించారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ కనీసం న్యాయవాద దంపతుల హత్యను ఖండించకపోవడం శోచనీయమన్నారు. బాధిత కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, న్యాయం జరిగే వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. వారి వెంట మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు, పెద్దపల్లి జిల్లా డీసీసీ అధ్యక్షులు ఈర్ల కొమురయ్య, సీనియర్ నాయకులు సెగ్గం రాజేష్, శశిభూషణ్ కాచే, తోట్ల తిరుపతి యాదవ్ ఉన్నారు.