Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో చేసిన కరోనా టెస్టులకుగాను 0.43 శాతం మందిలో కరోనా వైరస్ ఉన్నట్టు బయటపడింది. గురువారం రాత్రి 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో 40,821 నమూనాలకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 178 మంది కోవిడ్-19 బారిన పడ్డట్టు వెల్లడైంది. తాజాగా ఒకరు మరణించడంతో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,633కు చేరింది. ప్రస్తుతం 1939 యాక్టివ్ కేసులున్నాయి. మరో 684 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి.
ఐదు జిల్లాల్లో జీరో.....
తాజాగా జోగులాంబ గద్వాల, కామారెడ్డి, కొమ్రంభీం ఆసిఫాబాద్, నాగర్ కర్నూల్ , నారాయణపేట జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. తాజాగా జీహెచ్‌ఎంసీలో 30, మేడ్చల్ మల్కాజిగిరిలో 20, రంగారెడ్డి జిల్లాలో 15 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా జయశంకర్ భూపాలపల్లి,మహబూబాబాద్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వ్యాధి బారిన పడ్డారు.
4.14 శాతమే ఆక్యుపెన్సీ
ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న వారి సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 62 కోవిడ్-19 ప్రత్యేక ప్రభుత్వాస్పత్రుల్లో 8,577 బెడ్లకు గాను 363 (4.14 శాతం) మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. 216 ప్రయివేటు ఆస్పత్రుల్లో 7,633 బెడ్లు ఉండగా అందులో 726 మంది ఉన్నారు. మొత్తం యాక్టివ్ కేసులు 1,939 ఉండగా ఆస్పత్రుల్లో 1089 మంది రోగులు ఉన్నారు. అలాగే 850 మంది ఇంట్లోనే చికిత్స తీసుకుంటున్నారు.
అదుపులో కరోనా- కేంద్రానికి తెలిపిన రాష్ట్రం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా అదుపులోకి ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రానికి నివేదించింది. శనివారం కేంద్ర కేబినెట్ కార్యదర్శి డాక్టర్ రాజీవ్ గౌబా, రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పాజిటీవ్ రేటు 0.43 శాతం ఉందనీ, ప్రతి రోజూ 200 లోపు కేసులు నమోదు అవుతున్నాయనీ, ఇది చాలా తక్కువ అని అన్నారు. రాష్ట్రంలో 1100 ప్రాంతాల్లో ర్యాపిడ్ ఆంటిజెన్ పరీక్షలు నిర్వహించడం వల్ల కేసుల సంఖ్యను, కరోనాని నియంత్రించడం సాధ్యమైందని పేర్కొన్నారు. ఎవరికైన పాజిటీవ్ వస్తే వెంటనే మెడికల్ కిట్ ను అందిస్తున్నామన్నారు. ఇప్పటికే 75 శాతం మంది హెల్త్ వర్కర్లు, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సినేషన్ ఇచ్చామనీ, మార్చి ఒకటో తేది న ప్రారంభమయ్యే మూడవ విడత వ్యాక్సినేషన్‌కు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. రాజీవ్ గౌబ మాట్లాడుతూ కోవిడ్ కేసులు వేగంగా పెరగకుండా నియంత్రణ కోసం కంటైన్మెంట్, సర్వైలెన్స్, భారీ స్ధాయిలో వ్యాక్సినేషన్ తదితర చర్యలు చేపట్టాలని సూచిం చారు. ఈ సమావేశంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కార్యదర్శి ఎస్.ఏ.ఎం రిజ్వీ తదితర ఉన్నతా ధికారులు పాల్గొన్నారు.