Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బీజేపీకి ఓటు అడిగే నైతిక హక్కే లేదు: హైదరాబాద్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్ల సమావేశంలో మంత్రి కేటీఆర్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల పెంపును కేంద్రప్రభుత్వ వైఫల్యంగా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పురపాలకశాఖ మంత్రి కె తారక రామారావు అన్నారు. కేంద్రంలోని బీజేపీ తెలంగాణ రాష్ట్రానికి అదనంగా ఇచ్చింది ఏమీ లేదనీ, కేవలం వాట్సాప్ యూనివర్సిటీ ద్వారా అబద్ధాల ప్రచారాన్నే ఆపార్టీ నమ్ముకున్నదని విమర్శించారు. ఆరేండ్లు ఎమ్మెల్సీగా ఉన్న ఆపార్టీ అభ్యర్థి ఎన్ రామచంద్రరావు రాష్ట్రానికి, నిరుద్యోగులకు, ప్రజలకు చేసింది ఏమీ లేదని స్పష్టం చేశారు. హైదరాబాద్-రంగారెడ్డి- మహబూబ్‌నగర్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా శనివారంనాడాయన టీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో హైదరాబాద్ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్‌పార్టీకి చరిత్ర ఉన్నదే తప్ప, భవిష్యత్ లేదని అన్నారు. టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సురభి వాణీదేవికి అత్యంత క్లీన్‌చిట్ ఉందన్నారు. ఇప్ప టివ రకు రాష్ట్రంలో 1.33 లక్షల ఉద్యోగాలతో పాటు ప్రయివేటు రంగంలో 14 లక్షల ఉద్యోగాలను తీసుకొచ్చామని చెప్పారు. ఆరేండ్లలో సాధించిన అభివృద్ధిని ఓటర్లకు వివరించి, ఓట్లు అభ్యర్థించాలని అన్నారు. ప్రభుత్వోద్యోగులు తమకు వ్యతిరేకం అనేది దుష్ప్రచారమనీ, వారితో టీఆర్‌ఎస్‌కు ఉన్నది పేగుబంధమనీ చెప్పారు.