Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పెరుగుతున్న కేసులు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొంతకాలం తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు. ముందుగా వైద్యరోగ్యశాఖ అంచనా ప్రకారం జనవరి 15 నాటికి పూర్తిగా అదుపులోకి రావాల్సింది. అయితే, గత నెల రోజులుగా రోజు రోజుకీ వస్తున్న యాక్టివ్ కేసుల కన్నా కోలుకున్న వారి సంఖ్య ఎక్కువగా ఉండటంతో ఇక కరోనా పని ముగిసినట్టే అనే భావన నెలకొన్నది. అయితే ఉన్నట్టుండి వారం, 10 రోజులుగా రికవరీల కన్నా కొత్తగా నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ వారంలో వరుసగా 163, 114, 189,178, 176 కేసులొచ్చాయి. (23 నుంచి 25వ తేదీ వరకు బులెటిన్ విడుదల చేయలేదు.) మొత్తం 820 కోవిడ్-19 కేసులు నమోదయ్యాయి. అదే సమయంలో కోలుకున్న వారు వరుసగా 146, 143,129, 148, 163 మంది ఉన్నారు. మొత్తంగా 729 మంది ఉన్నారు. తాజాగా రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 1951. మరో వైపు ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా పెరుగుతూ వస్తున్నది. ఫిబ్రవరి 14న ప్రయివేటు ఆస్పత్రుల్లో 626 మంది ఉండగా ప్రభుత్వాస్పత్రుల్లో 373 మంది మొత్తం 999 మంది ఇన్ పేషెంట్లుగా చికిత్స పొందుతున్నారు. తాజాగా ప్రభుత్వాస్పత్రల్లో 358, ప్రయివేటు ఆస్పత్రుల్లో 734 మంది మొత్తం 1092 మంది ఉన్నారు. అయితే నారాయణపేట, గద్వాల, వనపర్తి, ములుగు, కొమురం భీమ్ ఆసిఫాబాద్ తదితర జిల్లాల్లో కేసుల నమోదు మొదట్నుంచి ఒకేలా ఉంటున్నది. ప్రతి రోజూ ఒకరిద్దరు లేదంటే జీరోగా నమోదవుతూ వస్తున్నది.
రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం రాత్రి 8 గంటల నుంచి శనివారం రాత్రి 8 గంటల వరకు 24 గంటల్లో 40,985 నమూ నాలకు పరీక్షలు నిర్వహించారు. వీరిలో 178 మంది కోవిడ్-19 బారిన పడ్డట్టు వెల్లడైంది. తాజాగా ఒకరు మరణించడంతో కరోనాతో ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 1,634కు చేరింది. మరో 640 మంది రిపోర్టులు రావాల్సి ఉన్నవి.
ఐదు జిల్లాల్లో జీరో.....
తాజాగా జయశంకర్ భూపాలపల్లి, కొమురం భీమ్ ఆసిఫాబాద్‌్, మహబూబాబాద్, నాగర్ కర్నూల్ , నారాయణపేట జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. జీహెచ్‌ఎంసీలో 27, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి జిల్లాల్లో 14 కేసులు నమోదయ్యాయి. అతి తక్కువగా ఒక్కరు వ్యాధి బారిన పడ్డారు.