Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఉద్యమ సమయం కార్పొరేట్ విద్య సంస్థల అంతుచూస్తామని హెచ్చరించిన కేసీఆర్, ఇతర నాయకులు ఇప్పుడు మౌనం వహించడం వెనుక లాలూచీ పడటమే కారణమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజరుకుమార్ విమర్శించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల తల్లిదండ్రులను ఫీజుల పేరుతో వేధించడం మానేయకపోతే బీజేవైఎం ఆధ్వర్యంలో ప్రత్యక్ష ఆందోళనకు దిగుతామని హెచ్చరించారు. చాలా మంది టీఆర్‌ఎస్ నేతలకు కార్పొరేట్ విద్యాసంస్థల్లో వాటాలున్నాయనీ, ఆ సంస్థల్లోని సిబ్బందికి వేతనాలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. నిరుద్యోగులకు రూ.78 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు.