Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశాన్ని దోచిపెడుతున్న మోడీ సర్కార్ : సీపీఐ(ఎం)
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దేశంలో పేదలు, సంపన్నుల మధ్య అంతరాలు పెరిగి సమా జానికి మరింత చేటు జరిగే పరిస్థితి దాపురించిం దని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శిం చారు. ప్రస్తుతం దేశంలో 209 మంది ధనవం తులు తమ ఆస్తులను పెంచుకు న్నారని వ్యాఖ్యానించారు. అదాని, అంబానీల ఆదాయం ఈ కొద్ది కాలంలో భారీగా పెంచుకోవడానికి నరేంద్రమోడీ ప్రభుత్వ విధానాలు తోడ్పడ్డాయని గుర్తు చేశారు. గౌతం అదాని లాంటి కుబేరులు ఏడాదిలోనే తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి కేంద్రం సాయం చేసిందని చెప్పారు. దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెడుతూ ధనవంతులను మరింత ధనవంతులుగా, పేదలను మరింత పేదలుగా మారుస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను తీవ్రంగా ఖండించారు. హురున్ అంతర్జాతీయ ధనవంతుల జాబితా ప్రకారం సంపదంతా ధనికుల చేతుల్లోకి పోయే విధానాన్ని మోడీ అమలు చేశారనే సంగతి బట్టబయలైందని చెప్పారు. ప్రభుత్వరంగ బ్యాంకుల వద్ద కార్పొరేట్లు లక్షల కోట్ల రుణాలు తీసుకుని ఉద్దేశ్యపూర్వకంగానే ఎగ్గొట్టి బ్యాంకులను దివాళా తీయిస్తున్నారని విమర్శించారు. వారిని మోడీ ప్రభుత్వం రక్షించడాన్ని ప్రశ్నించారు. కార్పొరేట్ల ప్రయోజనాల కోసం 100 ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేటీకరించి, వాటిని కారుచౌకగా తమ అనుయాయులకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నదని తెలిపారు.
రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ రంగాన్ని కేంద్రం ఏకపక్షంగా చట్టం చేసి, కేంద్రం స్థాయిలో రెగ్యులేటరీ ఆథారిటీని నియమించి రాష్ట్ర అధికారులను కుదించి ఫెడరల్ వ్యవస్థకు భంగం కలిగిస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పెద్ద టారీఫ్ వినియోగదారులను ప్రయివేటు వారు ఆకర్షిస్తారన్నారు. తక్కువ టారీఫ్ విద్యుత్ వినియోగదారులు ప్రభుత్వ విద్యుత్ సంస్థల జాబితాలో చేరడంతో ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థలు దివాళా తీస్తాయని అభిప్రాయ పడ్డారు. కార్పొరేట్లు ఇప్పటికే ఉన్న డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను వాడుకుని కేవలం వీలింగ్ ఛార్జీలను మాత్రమే చెల్లించి, ఉద్యోగుల కుదింపు, వేతనాలు తగ్గింపుతో పాటు, రిజర్వేషన్లు అమలు కాకుండా చేసి లాభాలను మూటగట్టుకుంటున్నారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్ సంస్థలను నిర్వీర్యం చేయడంతో, రాష్ట్రాలు భవిష్యత్‌లో ఉచిత విద్యుత్ ఇవ్వలేని స్థితికి చేరుకుంటాయన్నారు. కేంద్ర ప్రభుత్వ విధానాలు దేశంలోని పేద, సామాన్య ప్రజలకు తీవ్ర నష్టం కలిగిస్తున్నాయన్నారు. ఈ నేపథ్యంలో పేదలు, సంపన్నుల మధ్య అంతరాలకు కారణమవుతున్న మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రజలు పోరాటాల్లోకి రావాలనీ, ప్రభుత్వరంగాన్నీ, రాజ్యాంగ విలువలను కాపాడుకోవడానికి సిద్ధం కావాలని సీపీఐ(ఎం) కోరుతున్నదని చెప్పారు. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు.