Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మోడీ సర్కార్ విధానాలపై ఎల్‌ఐసీ ఉద్యోగులు పోరాడాలి
- కార్పొరేట్లతో ధర్మయుద్ధంలో ప్రజలదే గెలుపు : ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాల జేఏసీ సదస్సులో తమ్మినేని వీరభద్రం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రజల ఆస్తులను అప్పనంగా కార్పొరేట్లకు దోచిపెట్టడమే లక్ష్యంగా కేంద్రంలోని మోడీ సర్కారు పనిచేస్తున్నదని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. రాబోయే కాలంలో ప్రపంచ వ్యాప్తం గానూ, భారత్‌లోనూ కార్పొరేట్లు వర్సెస్ ప్రజల మధ్య పోరు జరుగబోతు న్నదనీ, ఆ ధర్మయుద్ధంలో ప్రజలే గెలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఎల్‌ఐసీ ఉద్యోగ, ఏజెంట్ల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి సదస్సు బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆధీనంలోని గనులు, ఎయిర్‌పోర్టులు, పోర్టులు, బ్యాంకులు, ఎల్‌ఐసీ వంటి సంస్థల లక్షల కోట్ల ఆస్తులను పాలకులు ఉదారంగా కట్టబెట్టడుతుండటం వల్లే కార్పోరేట్ల ఆస్తులు పెరిగాయి తప్ప వారి కష్టారితం వల్ల కాదన్నారు. కరోనా లాంటి కష్టకాలంలో ప్రపంచంలోని ప్రధాన కార్పోరేట్ల ఆస్తులు 13 నుంచి 15 శాతం పెరిగాయని వివరించారు. ప్రపంచంలోని అన్ని బీమా సంస్థల్లోకెల్లా ఎల్‌ఐసీ గొప్పదన్నారు. అలాంటి సంస్థను పాలకులు నిర్వీర్యం చేయాలని చూడటం దారుణమని విమర్శించారు. ఈ క్లిష్ట సమయంలో ఎల్‌ఐసీ
ఉద్యోగులు బలమైన ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్ కనుసన్నల్లోని ఫాసిస్టు ఆలోచనా ధోరణితో కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం హయాంలో ఆర్థిక సంస్కరణల వేగం పెరిగిందన్నారు. మోడీ సర్కారు నిరంకుశ వైఖరితో ముందుకు సాగుతూ ప్రభుత్వ రంగ సంస్థలను నిసిగ్గుగా అమ్మేస్తున్నా రని విమర్శించారు. పైగా, ఐఏఎస్‌లు ఉన్నది వ్యాపారం చేయడానికా? పాలిం చడానికా? ప్రభుత్వ రంగ సంస్థలెందుకు? అని బాహాటంగా ప్రధాని మాట్లాడ టం దుర్మార్గమన్నారు. ఇది ఆత్మనిర్భర భారతం పేరుతో దేశాన్నే తాకట్టు పెడు తున్నారనీ, దీనిని ఎవ్వరూ ప్రశ్నించకుండా దేశం కోసం త్యాగాలు చేస్తున్నామం టూ ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొడుతున్నారని విమర్శించారు. సమాజహి తం కోసం పాటుపడుతున్న ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయటం అన్యా యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్సూరెన్స్ రంగం సీనియర్ నాయకులు, ఏఐఐఈఏ మాజీ కార్యదర్శి వేణు గోపాల్, ఏఐఐఈఏ సంయుక్త కార్యదర్శి క్లెమెంట్‌దాస్, ఫెడరేషన్ ఆఫ్ ఎల్‌ఐసీ క్లాస్ వన్ ఆఫీసర్స్ అసోసియేషన్ జోనల్ కార్యదర్శి నట్ట జ్వెన్స్, ఎన్‌ఎఫ్‌ఐఎఫ్ డబ్ల్యూఐ నాయకులు రామ్‌కుమార్, ఆల్ ఇండియా ఎంప్లాయీస్ ఫెడరేషన్ సం యుక్త కార్యదర్శి పి.మహేశ్, ఎల్‌ఐసీ ఏజెంట్స్ అసోసియేషన్ నాయకులు పద్మా రెడ్డి, క్రిష్ణారెడ్డి, ఏఐఐఈఏ హైదరాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి తిరుపతి, సికింద్రాబాద్ డివిజన్ ప్రధాన కార్యదర్శి రాజేశ్‌సింగ్, తదితరులు పాల్గొన్నారు.