Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.బాలయ్య, పి.సుధాకర్
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
తెలంగాణ సివిల్ సప్లయిస్, జీసీసీ హమాలీ వర్కర్స్ యూనియన్(సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా ఎన్.బాలయ్య, పి.సుధాకర్ ఎన్నికయ్యారు. ఆ సంఘం కార్యనిర్వాహక అధ్యక్షులు బుస్సామొగిలి అధ్యక్షతన రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. అందులో 31 మందితో నూతన రాష్ట్ర కమిటీని ఎన్నుకున్నారు. ఆ సంఘానికి గౌరవాధ్యక్షులుగా సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పాలడుగు భాస్కర్, కోశాధికారిగా సి.నరేందర్, కార్యనిర్వాహక అధ్యక్షులుగా బుస్సా మొగిలి ఎన్నికయ్యారు. మొత్తం 9 మంది ఉపాధ్యక్షులు, 9 మంది జాయింట్ సెక్రటరీలు, 8 మంది కమిటీ సభ్యులతో జనరల్ బాడీని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో భద్రాద్రి కొత్తగూడెం, నల్లగొండ, సూర్యాపేట, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, అసిఫాబాద్, మహబూబాబాద్ ఎంఎల్‌ఎస్ పాయింట్ల నుంచి హమాలీ కార్మికులు పాల్గొన్నారు.