Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటీషన్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ)కి మేలు జరిగేలా చేసినట్లుగా తనపై సీబీఐ నమోదు చేసిన తొలి చార్జిషీటును కొట్టేయాలని ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి హైకోర్టులో అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. సీబీఐ కేసు కొట్టేయాలని 2015లోనే ప్రధాన కేసును బలపర్చే కొన్ని పత్రాలతో మధ్యంతర పిటిషన్‌ను దాఖలు చేశారు. సీబీఐ నమోదు చేసిన అభియోగాల్లో ఒక్క ఆరోపణకు కూడా ఆధారాలు చూపలేదనీ, ఐఎఎస్ అధికారిగా తన విధులు నిర్వహించానని పేర్కొన్నారు. చట్ట ప్రకారమే అన్నీ చేశాననీ, రాష్ట్రానికి ఏమీ నష్టం చేకూర్చలేదని తెలిపారు. ఈ అంశాలపై సీబీఐ చేసిన ఆరోపణలకు నేటి వరకూ ఆధారాలు ఒక్కటీ చూపలేదన్నారు. తనను కేసులో ఇరికించి చట్ట విరుద్ధంగా, రాజ్యాంగ ఉల్లంఘనకు సీబీఐ పాల్పడినట్టు ప్రకటించాలని కోరారు.